ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోయండంతో పాటు వరుసగా రెండో ఏడాది రక్తదాన, అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగు ప్రజల శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్న యువనేతకు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 184 మంది న్యాయవాదులు రక్తదానం చేసి యువనేతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.డి షరీఫ్ మాట్లాడుతూ.. నేటి యువతకు నారా లోకేష్ గారే స్ఫూర్తి అని అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిగా, నిరంతరం తెలుగు ప్రజలకు అండగా ఉంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని లోకేష్ నింపారన్నారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తుకై అలుపెరుగని పోరాటం చేసిన లోకేష్ బాబు రేపటి తరానికి ఒక దిక్సూచి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అధికంగా ఉందని, ఇప్పుడు పారిశ్రామిక రంగాన్ని ప్రస్తుతమున్న ప్రభుత్వం గాలికి వదిలేసిందని అధికార పార్టీపై మండిపడ్డారు.

లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించేందుకు సమర్ధవంతమైన నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారు. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే.. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ పారా కిషోర్, కోశాధికారి దాసరి రవీంద్రబాబు, ఐటీడీపీ లీగల్ కో-ఆర్డినేటర్ రేవతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply