Suryaa.co.in

Andhra Pradesh

బాలల ఆశ్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

– అనాధ పిల్లలకు భోజనం, పుస్తకాలు, నిత్యావసరాలు అందజేత
– ప్రతియేటా ఇదే విధంగా లోకేష్ జన్మదిన వేడుకలు
– నాదెండ్ల బ్రహ్మం చౌదరి

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మానవీయ కోణంలో జరిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని చిగురు అనాధ ఆశ్రమంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించి తన ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమంలోని 150మంది విద్యార్థులకు భోజనాలు, పుస్తకాలు, అందించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ…మా యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను పదిమందికి ఉపయోగపడేలా చేయాలని భావిస్తారు. ఆ బాటలోనే తల్లిదండ్రులు లేని నిరాశ్రయులైన పసిపిల్లల వద్ద జరుపుకుని వారి కళ్లల్లో ఆనందం చూడాలనే కాంక్షతో ఈ సంవత్సరం చిగురు ఆశ్రమంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించాం. ఏపీ రాజకీయాలు గతంలో టీడీపీ ముందు..టీడీపీ తర్వాత అనే విధంగా ఉండేవి. కానీ పాదయాత్ర ముందు..పాదయాత్ర తర్వాత అనే స్థాయికి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు నారా లోకేష్ కు దక్కడం చాలా ఆనందంగా ఉంది.

పాదయాత్ర తర్వాత వచ్చిన మొదటి జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చిగురు ఆశ్రమాన్ని ఎంచుకున్నాం. తల్లిదండ్రులు లేని పిల్లలైనప్పటికీ వాళ్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలివితేటలతో, చురుకుగా ఉన్నారు..వాళ్లలో చదువుకోవాలనే బలమైన కాంక్షకు బలాన్ని చేకూర్చేలా తమ వంతు సహాయసహకారాలు ప్రతియేటా అందించేందుకు నిర్ణయించుకున్నాం. మా నాయకుడికి ఈ పసిహృదయాల ప్రేమాభిమానాలు తోడవ్వడం చాలా ఆనందంగా ఉంది..అన్నారు.

తమ వద్ద లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి భూషణం, తెలుగుయువత అధికార ప్రతినిధి సజ్జ అజయ్, తెలుగు రైతు రాష్ట్ర ప్రధానకార్యదర్శి, కార్యక్రమాల ఇన్చార్జి బొంతు సాంబిరెడ్డి, రాజా, సుధాకర్, కోటిరెడ్డి, కిరణ్, యువజన నాయకులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE