టీడీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

ప్రజా నాయకుడు, ప్రజల సేవకుడు నారా లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో భారీ వేడుకలు నిర్వహించారు. జగన్ రెడ్డి దాష్టీకాలపై ఎదురులేని పోరాటం చేసిన యోధుడు నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.

జగన్ రెడ్డి పాలనలో దగా పడ్డ యువతకు ప్రతినిధిగా చేపట్టిన యువగళం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్. నారా లోకేశ్ పోరాట పటిమ రాష్ట్రంలోని యువతకు ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు లోకేశ్ మాత్రమే. రాష్ట్రంలోని యువత జీవితాలను మార్చే నారా లోకేశ్ నాయకత్వంలో నడిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పని చేసే సిబ్బందికి నూతన వస్త్రాలు, స్వీట్లు అందించారు.

కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వాసంశెట్టి సత్య, బీసీ సాధికార సమితి జోనల్ కోఆర్డినేటర్లు పూతి కోటేశ్వరరావు, తమ్మిశెట్టి రమాదేవి, తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్, నరసింహులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సింహాద్రి కనకాచారి, బీసీ సెల్ అధికారప్రతినిధి పేరేపి ఈశ్వర్, నగరాల సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరిపెడ తిరుమలేష్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply