– మీడియాతో మాజీ మంత్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్సీ ఛైర్ పర్సన్ పీతల సుజాత
మంగళగిరి: ఆడ బిడ్డలు, అక్కా చెల్లెమ్మల ఆర్థిక ప్రగతిని వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధంతామే తెలుగు దేశం పార్టీ విధానమని… ఆనాడు అన్న ఎన్టీఆర్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చారని మాజీ మంత్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్సీ ఛైర్ పర్సన్ పీతల సుజాత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా అనే విత్తనం వేసి నేడు కోటి మంది మహిళలు వారి వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ప్రోత్సహించారు. మహిళా సాధికారతను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది.
యువ నేత మంత్రి నారా లోకేష్ ఆలోచనల నుంచి వచ్చిన నా తెలుగు కుటుంబం తీర్మానాల్లోని విధానం ద్వారానే స్త్రీ శక్తి పథకం రూపొందింది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు ప్రభుత్వం పథకాలను అమలుచేస్తోంది. రాష్ట్ర మహిళల తరఫున చంద్రబాబుకి, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేస్తున్నాం.
మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉచిత బస్సు పథకాన్ని కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిజేస్తున్నాం. మహిళలకు ఇచ్చిన కానుక స్త్రీ శక్తి పథకం ఒక చారిత్రాత్మకమైన గిప్ట్. రాఖీ పండుగను అక్కా చెల్లెలు ఎలా గుర్తుపెట్టుకుంటారో నేడు స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతో మంచి పథకాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు. సంతోషిస్తున్నారు.
వైఎస్ భారతి కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు
ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేకంగా మాట్లాడుతోందని సుజాత విమర్శించారు. ఇంత మంచి పథకంపై కూడా వైసీపీ వాళ్లు విమర్శలు చేయడం వాళ్ల దిగజారుడు తననానికి నిదర్శనం. వైఎస్ భారతి కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఫ్రీ టికెట్ ద్వారా పులివెందుల నుంచి అమరావతికి రావచ్చు. ఆమెకు ఇక్కడ ఆధార్, అడ్రస్ తో గుర్తింపు కార్డు ఉండాలి. మహిళా సాధికారత, మహిళా స్వావలంబనే ధ్యేయంగా సూపర్ సిక్స్ పథకాలతో పెద్ద పీట వేశారు.
సూపర్ సిక్స్ పథకాన్ని మహిళలకు అద్భుతమైన కార్యక్రమాలను తీసుకొచ్చారు. చెప్పిన విధంగా ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసిన దమ్మున్న నాయకుడు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ 3 వేలు చేసేందుకు ఏడాది పాటు రూ.250 పెంచుకుంటూ పెంచుకుంటూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ప్రజలకు నరకం చూపించారు.
అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలు కలిపి రూ.7 వేల పెన్షన్ ను కూటమి ప్రభుత్వం అందజేసింది. తల్లికి వందనం పథకం ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేశాం. వైసీపీ హయాంలో కేవలం ఒక్కరికే తల్లికి వందనం పథకం అమలు చేశారు.
‘స్త్రీ శక్తి’తో ప్రభుత్వానికి ఏటా రూ.1,942 కోట్ల భారం
అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను వేల కోట్లతో చేపడుతున్నాం. ఇంకా నాలుగేళ్లలో అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఈ స్త్రీ శక్తి పథకం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబ బంధాలు కూడా బలపడతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల శుభకార్యాలకు వెళ్లాలన్న మహిళలు చాలా ఆలోచిస్తారు. అలాంటి దిగులు లేకుండా చంద్రబాబు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా మహిళలు అధికంగా పాల్గొంటారు. మొత్తం 100 శాతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 74 శాతమున్న ఐదు రకాల బస్సులైన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం సాగించవచ్చు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సులో ఎక్కిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయబడతాయి. పొదుపు చేసిన డబ్బు మొత్తం ప్రభుత్వం అందించే 100% సబ్సిడీని సూచిస్తాయి. ఈ టికెట్లపై “స్త్రీ శక్తి” అని ముద్రణ చేయబడుతుంది. ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉండగా 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,942కోట్ల రూపాయల భారం పడుతుంది.
ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటివరకు సుమారుగా 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు రూ.6,700 కోట్లు ఆదా చేశారు. కర్నాటక రాష్ట్రంలో శక్తి పథకం ద్వారా 475 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఇప్పటివరకు రూ.12,000 కోట్లు ఆదా చేశారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడమే కాకుండా… సామాజిక కార్యాక్రమాల్లో వారు చురుగ్గా పొల్గొనే అవకాశం కల్పించినట్టు అవుతుంది. ప్రస్తుతం ‘స్త్రీ శక్తి’ అమలు తర్వాత మహిళల ప్రయాణం సంఖ్య 40 శాతం నుంచి అనూహ్యంగా 67 శాతానికి పెరుగుతుంది. ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా రూ.288 కోట్ల రూపాయల రాబడి తగ్గుతుంది. అదనంగా నిర్వహణ ఖర్చులు రూ.201 కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉంది.
మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా కండక్టర్లకు శరీరానికి ధరించే (బాడీ వోర్న్) కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని రూట్లు.. ఏపీ పరిధిలో మొదలై పొరుగు రాష్ట్రంలో కొన్ని గ్రామాల మీదుగా ప్రయాణించి మళ్లీ ఏపీలోని గమ్యస్థానానికి చేరుతుంటాయి. రాయలసీమ జిల్లాల్లో ఇటువంటి రూట్లు (ఎన్వ్ రూట్లు) ఉన్నాయి. అటువంటి రూట్లలో అయిదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే మహిళల అభివృద్ధికి మరిన్ని పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది.
మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తింది. స్త్రీ నిధి రుణాలను రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వడ్డీ రాయితీని రూ.3లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిద్దడమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఎన్నడు లేని విధంగా అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందజేస్తోంది.
గ్రామైక్య మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. అందులో రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. మహిళా సాధికారతకకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తూనే… బాలికల విద్యకు అత్యధిక నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇస్తుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాం.
ఒక్కో మహిళా సంఘానికి గరిష్ఠంగా రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు రుణాల మంజూరు చేయడం చేశాం. తద్వారా రాష్ట్రంలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలను మహిళలు ఏర్పాటు చేసుకునేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 2.5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారుచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది.
నేడు మహిళలు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. వారికి సరైన ప్రోత్సాహకం ఇస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని గ్రహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. మరోసారి మహిళల కోసం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.