తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కొట్టేసేందుకు వైఎస్ జగన్ భూభక్ష పథకం

– పూర్వీకులు ఇచ్చిన మా పొలాల పట్టాదార్ పాస్ బుక్ లపై నీ బొమ్మలు ఏంటి జగన్ రెడ్డి?
-రైతు పాసుబుక్కుపై ఎవరిదో ఫోటో వేసి పక్క రాష్ట్రపు ఫోన్ నెంబర్ నమోదు చేశారు
– మాజీ మంత్రి దేవినేని ఉమా

వైసిపి ప్రభుత్వం దురుద్దేశంతో తీసుకువచ్చిన భూ రక్షణ చట్టం వల్ల ప్రజలు రోజూ తమ ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం రద్దు చేయాలంటూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సివిల్ కోర్టుల వద్ద లాయర్లు ఏడవ రోజు చేస్తున్న రిలే నిరాహార శిబిరంలో పాల్గొన్న దేవినేని ఉమ వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు

సెంట్రల్ యాక్ట్ కి విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి భూ రికార్డులను , ఇష్టారాజ్యంగా మార్చేసే హక్కు మీకు ఎక్కడిది?ప్రజలు రోజూ తమ ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితిని రాష్ట్రంలో తీసుకువచ్చారు. పూర్వీకులు ఇచ్చిన మా పొలాల పట్టాదార్ పాస్ బుక్ లపై నీ బొమ్మలు ఏంటి జగన్ రెడ్డి?

రైతువి రెండు ఫోటోలు ఉంటే జగన్ వి 9 ఫోటోలు వేసుకున్నాడు. వీరులపాడు మండలం గూడెం మాధవరానికి చెందిన గోపాలకృష్ణయ్య అనే రైతు పాసుబుక్కుపై ఎవరిదో ఫోటో వేసి పక్క రాష్ట్రపు ఫోన్ నెంబర్ నమోదు చేశారు.అదేమని అడిగితే రైతుకు సమాధానం చెప్పే నాధుడు లేడు ఆ రైతు ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి?

Leave a Reply