పద్మారావు ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ

– హాజరైన వేలాది మంది అయ్యప్ప స్వాములు

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మోండా మార్కెట్ లోని టకార బస్తీ నివాసం వద్ద అయ్యప్ప పడి పూజ ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ తో పాటు కంటోన్మెంట్, సనత్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అలంకారంతో రూపుదిద్దుకున్న మహా పడి వద్ద భజనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు భక్తులను ఆనంద పారవశ్యంతో ముంచెత్తాయి.

Leave a Reply