వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్..

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా లింగగిరి క్రాస్‌రోడ్స్‌ దగ్గర.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిన్న తన పాదయాత్ర 3వేల 500 కిలోమీటర్లు దాటిన సందర్భంగా నర్సంపేటలో ఆమె పైలాన్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ క్రమంలో.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ ఉదయం నుంచి ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెన్నారావుపేటలో షర్మిల వ్యాన్‌ను తగలపెట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇటు పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు.. అటు టీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో పరిస్థితి హైటెన్షన్‌గా మారింది. ఈ క్రమంలో లింగగిరి క్రాస్ రోడ్స్‌ దగ్గరకు చేరుకోగానే.. పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply