Suryaa.co.in

Andhra Pradesh

కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలయింది

-క్లాస్ వార్ గురించి జగన్ మాట్లాడే స్థాయి లేదు
-33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని జగన్ ఒప్పుకున్నారు
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలకి నా కృతజ్ఞతలు. రచయిత ఎవరి పక్షం నిలబడి రాసారో పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలపాటి సురేష్ రాసిన పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. పుస్తకంలో ఉన్న చాలా సంఘటనలకి నేను సాక్షిని.

వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అన్న మాటకు ఈ పుస్తకం కారణం. ఎన్నికలు అయిన వెంటనే కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలు అయింది. అమరావతి ప్రజల శరీరం మీద దెబ్బలు చుస్తే కన్నీళ్లు వచ్చాయి. ఈ పుస్తకం ప్రతి పాలకులకి ఒక నిదర్శనం. ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజా పక్షం నిలబడేలా ఈ ఆడపిల్లల మిస్సింగ్ మీద నా మాటలు వేరుగా అర్ధం చేసుకుంటున్నారు.

వాలంటీర్ సేకరించిన డేటా హైదరాబాద్ లో ఒక ప్రవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు అని అడిగా. వాలంటీర్ అందరూ చేసారని నేను అనలేదు. కొంతమంది గురించి అన్నాను. చివరికి 33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని జగన్ ఒప్పుకున్నారు. క్లాస్ వార్ గురించి జగన్ మాట్లాడే స్థాయి లేదు క్లాస్ వార్ మీద కూడా ఒక పుస్తకం సురేష్ రాయాలి.

LEAVE A RESPONSE