Suryaa.co.in

Andhra Pradesh

మీ భూమి మా హామి

-వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం

మీ భూమి మా హామి
100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానుల 21,404 భూ కమతాలకు సంబందించిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి, 3,304 అభ్యంతరాలను పరిష్కరించి భూమి రికార్డులను నేడు (18.01.2022, మంగళవారం) క్యాంప్‌ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్న సీఎం  వైఎస్‌ జగన్‌.

రాష్ట్రవ్యాప్తంగా మన భూములు, ఆస్తుల రక్షణకు మహా యజ్ఙాన్ని చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.జూన్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లు, నేడు 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం

భూ రికార్డుల ప్రక్షాళణ…భూ కమతం ఒక సర్వే నెంబర్‌ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో వస్తున్న భూ వివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే గత పరిస్ధితికి ఇక చెల్లు చీటి…భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్‌ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు.

అత్యాధునిక సాంకేతికత
దాదాపు రూ. 1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, 70 కార్స్‌ బేస్‌ స్టేషన్లు, 1500 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతో రీసర్వే
ప్రతి భూ కమతానికి విడిగా ఆకాంక్ష, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే
j క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ
గ్రామ స్ధాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు ( భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటు

శాశ్వత భూ హక్కు
సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ దిశగా అడుగులు
భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభం

భూ రక్ష
ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు
డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు ఇక చెక్‌
దళారీ వ్యవస్ధ ఇక రద్దు, లంచాలకు ఇక చోటు లేదు

భద్రత
నకిలీ పత్రాలకు ఇక తావులేదు
భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవు
భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులు
అవసరమైన చోట సబ్‌ డివిజన్‌ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు

పారదర్శకత
సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం
మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం
తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల సర్వే మరియు యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీ

గ్రామాల చెంతకే సేవలు
ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్‌ లైన్‌ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా సబ్‌ డివిజన్‌ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కారం
ఇకపై గ్రామ సచివాలయాల్లో కూడా స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లు
భూ సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా పొందవచ్చు

భూ వివాదాలకు ఇక చరమగీతం, భూ లావాదేవీలు ఇకపై సులభతరం, వివాద రహితం, ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం. మీ భూములు, మీ ఆస్తులు ఇక సురక్షితం.

LEAVE A RESPONSE