– పొలంలోకి రాకుండా దౌర్జన్యంలో టీడీపీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
• రీ సర్వేలో గందరగోళం.. ఇతరుల రికార్డుల్లోకి భూమి
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి: శ్రీకాకుళం జిల్లా, గార మండలం రామచంద్రపురం అగ్రహరం గ్రామానికి చెందిన దండుపాటి యర్రయ్య శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో తమ సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాను. చినకాని గణేష్ అనే వైసీపీ నాయకుడు తన భూమిని కబ్జా చేసి పొలంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు. పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయి. వారి వద్ద ఎలాంటి పొలానికి సంబంధించిన పత్రాలు లేవు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చౌటపాచర్ల గ్రామానికి చెందిన కసిరెడ్డి సంజీవరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమ తండ్రి 15 ఎకరాల పొలం కొట్టారు అప్పటి నుంచి ఆ భూమిని సాగుత చేస్తున్నాము. పాసుబుకులు ఉన్నాయి. పన్నులు కూడా కడుతున్నాం. ఆన్ లైన్ లో 100ఏ అని ఉంటే 200ఏ రికార్డుల్లో వాగు పొరంబోకు అని రాశారు. తమ పొలంలో అన్నసముద్రం గ్రామం ఇలాకాలో ఉంది. గత 50 ఏళ్లుగా సాగు చేస్తున్నాం. తమయందు దయవుంచి తమ పొలాన్ని ఆన్ లైన్ చేయాల్సింది అభ్యర్ధించాడు.
ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన నాయుడు వెంకట శివప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.183/2లొమె 2.58 సెంట్లు రీసర్వేలో ఎల్పీఎమ్ నెం.1092 నందు య.2.44 సెంట్లు మాత్రమే వచ్చింది. విస్తీర్ణంలో 0.140 సెంట్లు వ్యత్యాసం వచ్చిందని తెలిపారు. తన భూమికి దక్షిణ వైపు ఉన్న సర్వే నం.183/1లో నాయుడు శ్రీనివాసరావుకి 1.96 సెంట్లు మాత్రమే ఉండగా ఎల్పీఎమ్ నెం. 1091లో 2.173 సెంట్లు నమోదు కావడంతో తన భూమిలోని కొంత భాగం వారి రికార్డుల్లో చేరింది. తమయందు దయవుంచి తమ భూమి మొత్తాన్ని తమపేరుతో ఆన్ లైన్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన కుటుంబానికి బండారుపల్లి శివారు గరికపాడు పరిధిలో సర్వే నెం.810/1లో 1.25 ఎకరాలు కుటుంబ సభ్యుల పేర్లపై కలిపి 13.75 సెంట్ల భూమి ఉంది. అనారోగ్యం కారణంగా 15 సెంట్ల భూమిని కౌలు ఇచ్చి దానికి వేసిన ఫెన్సింగ్ ఏర్పాటు చేశాను. సదరు భూమికి దక్షణంవైపు భూమి కలిగిని ఏరువ దేవేంద్రారెడ్డి అలియాస్ బూస్, అతని తండ్రి ఏరువ భాస్కరరెడ్డి పెన్సింగ్ రాళ్లను ధ్వంసం పెన్సింగ్ తీగలు తీసివేశాడు. భూమి అమ్మకపోతే పంట వేయనివ్వమని బెదిరించారు. తనను కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. తమయందు దయవుంచి ఈ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట గ్రామానికి చెందిన షేక్ జజ్జర్ పీరా గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో పూర్వీకుల సంపాదనలో భాగంగా ఉన్న సర్వే నం. 271/3లో 25 సెంట్ల స్థలంలో తమ తల్లిగారు రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చిన సుమారు 13 సెంట్లు స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి కొందరు అగ్రకులస్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఇబ్బందులు కలిగిస్తున్నారు. తన దరఖాస్తుపై మండల సర్వేయరుతో సరైన కొలతలు వేయించమని అడిగినప్పటికీ రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు