– బాబు బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు
– సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో, మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు: ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, వైసిపి నాయకులు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో లక్ష కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమలు స్థాపించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే పదివేలలక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. బాబు బ్రాండ్ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.