యువగళం కేవలం పాదయాత్రే కాదు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జైత్రయాత్ర

– నవశకం బహిరంగసభలో మాజీమంత్రి పితాని సత్యనారాయణ

యువగళం-నవశకం రాష్ట్ర ప్రజానీకంలో నూతనోత్తేజాన్ని తెచ్చింది.పోలిపల్లి సభతో సైకో సర్కారుకు అంతిమ ఘడియలు ఆరంభమయ్యాయి. యువగళం కేవలం పాదయాత్రే కాదు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జైత్రయాత్ర. జగన్ అరాచకపాలనతో 5కోట్ల ప్రజల ఆశలు, ఆశయాలను ఆవిరిచేశాడు. ప్రజలకు భరోసానిస్తూ ముందుకు కదిలిన దమ్మున్న నాయకుడు నారా లోకేష్.

నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్న జగన్ ఆయా వర్గాలకు ఏం చేశాడో చెప్పగలడా? బీసీలకు పెట్టిన కార్పొరేషన్లలో చైర్ పర్సన్లు కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా ఇవ్వలేదు…కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు.జగన్ పాలనలో శాండ్, లిక్కర్, ల్యాండ్, మైన్ మాఫియా పేట్రేగిపోతోంది.సెంటు పట్టాల పేరుతో పేద, బడుగుల అసైన్డ్ భూములను జగన్ దోచుకున్నాడు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రాజకీయ రిజర్వేషన్లను అమలు చేసేందుకు టీడీపీ-జనసేన కృషి చేస్తుంది. 2024 లో జరగనున్న కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు గెలిపించాలి.

యువగళం-నవశకం దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం-  కింజరాపు రామ్మోహన్ నాయుడు
యువగళం-నవశకం దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది.కుప్పంలో మొదలైన యువగళానికి అన్ని జిల్లాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టి విజయవంతం చేశారు. మరో 100రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నాం..రాష్ట్రానికి పట్టిన శని వదలించుకోబోతున్నాం. రైతులు రారాజులు కాబోతున్నారు..నిరుద్యోగులు ఉద్యోగాల్లోకి వెళ్లబోతున్నారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రాబోతున్నారు. మహిళలు ధైర్యంగా రోడ్లపై తిరగే స్వేచ్ఛ, భద్రత రాబోతోంది.2019 ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ పని అయిపోయిందనుకున్న వాళ్లంతా ఈ సభను తమ కళ్లతో చూడాలి. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పిల్లి ఎన్ని కుట్రలు పన్నినా మనం భయపడాల్సిన అవసరం లేదు. టీడీపీ-జనసేన పార్టీలను ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుతున్నా.

అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నం-  వర్ల రామయ్య
రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోంది. యువనేత లోకేష్ యువగళంలో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసాను కల్పించారు. యువగళం పాదయాత్ర ప్రత్యర్థుల రాష్ట్రంలో అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారింది. రాబోయే రోజుల్లో టిడిపి-జనసేన పార్టీలు సాధించబోతుందనడానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనం.

అన్ని వర్గాల సంక్షేమం టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యం-  బొమ్మిడి నాయకర్
విజయనగరం జిల్లా పోలిపల్లి జన సముద్రం కనిపిస్తోంది.సైకో పాలనను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. 2024లో జనసేన-టీడీపీ సంయుక్తంగా ఒకే తాటిపై ముందుకెళ్లి సైకోపాలనకు చరమగీతం పాడతాయి.

జగన్ అధికారంలోకి వచ్చాక వెనుకబడిన ప్రాంతాలను మరింత నాశనం చేశాడు. తడ నుండి ఇచ్చాపురం వరకు మత్స్యకారులు అత్యధికంగా ఉన్నారు.217జీఓ తో మత్స్యకారుల కడుపుకొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.టీడీపీ-జనసేన కూటమితో వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి. అన్ని వర్గాల సంక్షేమం టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యం.

Leave a Reply