Home » మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల పుట్టినరోజు వేడుకలు

మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల పుట్టినరోజు వేడుకలు

– మంత్రి కొడాలి నాని, గొర్ల శ్రీను లకు గజమాలతో సత్కారం
గుడివాడ , సెప్టెంబర్ 2 : రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి . గురువారం గుడివాడ పట్టణంలోని ఏలూర్ రోడ్డులో ఉన్న గొర్ల శ్రీను నివాసంలో పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిని , గొర్ల శ్రీనులను భారీ గజమాలలతో ఘనంగా సత్కరించారు . పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కొడాలి నాని పరిశీలించారు . రక్తదానం చేసిన దాదాపు 22 మంది దాతలను మంత్రి కొడాలి నాని అభినందించారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా గొర్ల శ్రీను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు . భవిష్యత్తులో మరిన్ని పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో ప్రముఖులు తోట నాగరాజు , పెయ్యల ఆదాం , మట్టా జాన్ విక్టర్ , రవికుమార్ , పాలేటి చంటి , మండలి హనుమంతరావు , డొక్కు రాంబాబు , కందుల నాగరాజు , మేకల సత్యనారాయణ , ఆర్‌ఎల్ నరసింహారావు , లోయ రాజేష్ , దారం నరసింహ , దారం ఏడుకొండలు , దారం వెంకటేశ్వరరావు , అల్లం సూర్యప్రభ , మాదాసు వెంకటలక్ష్మి , అల్లం రామ్మోహన్ , లోయ సత్యనారాయణ , కొలుసు శివ , గొరిపర్తి నాగరాజు , ఖాజా , పంచకర్ల వెంకట్ , పర్వతనేని ఆనంద్ , చింతల భాస్కరరావు , గుత్తా నాని , యార్లగడ్డ సత్యభూషణ్ , పొట్లూరి మురళీధర్ , సింగిరెడ్డి గగారిన్ , గోగం సురేష్ , గోళ్ళ సోమేశ్వరరావు , శాయన రవికుమార్ , బాలకృష్ణ , చిన్ని సత్య దుర్గాప్రసాద్ , బోయిన శేఖర్ , మురళి , రహ్మతుల్లా , అలీ గౌస్ , షేక్ బాజీ , షేక్ సైదా , మామిళ్ళ ఎలీషా బ్రదర్స్ , బర్నబాస్ , లోయ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply