– జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్
YCP ప్రభుత్వం ప్రజలకు 14 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 1400 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్ చేసింది. అది కూడా ఎన్నికలైన వెంటనే కాకుండా 3 రోజుల తర్వాత చెల్లించిందని విమర్శించింది. మే 14న ఆర్బీఐ నుంచి 4000కోట్ల అప్పు తీసుకుని, అందులో 1400 కోట్లు మాత్రమే పథకాలకు చెల్లించిందని పేర్కొంది. పేదలకు ఎగ్గొడుతూ ఆ డబ్బును తమ సొంత కాంట్రాక్టర్లకు ఇస్తోందని ఆరోపించింది.