Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి కి అంగన్వాడి ఉద్యోగుల ఆవేదన కనిపించట్లేదు

– దేవినేని ఉమా

పామర్రు: 36రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. కృష్ణాజిల్లా పామర్రు లో అంగన్వాడి దీక్ష శిబిరానికి పామర్రు ఇన్చార్జి వర్ల కుమారరాజాతో కలిసి వెళ్లిన దేవినేని ఉమా వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం ప్రభుత్వ దుర్మార్గ చర్య.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతుని ఇస్తుంది అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తుంది.

అంగన్వాడి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టిలో లేవు, ఆయనకు తెలియదని మంత్రి బొత్స చెప్పటం బాధ్యతారాహిత్యం. ఇప్పటివరకు అంగన్వాడి అమ్మలు రోడ్డు పక్కన మాత్రమే నిరసన చేపట్టారు. అదే అమ్మలు రోడ్డెక్కితే పోలీసు వ్యవస్థ కూడా నిలువరించలేదు.

పండగ పర్వదినాన కుటుంబ సభ్యులను సైతం వదిలి నిరసన దీక్షలో పాల్గొంటున్న వారిని విస్మరించడం బాధాకరం.కేవలం ఒక వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయిస్తే అంగన్వాడీల సమస్యలు తీరిపోతాయి.

10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు.ల్యాండ్, శాండ్, మైన్, వైన్ , సెంటు పట్టా భూములు అన్నీ కలిపి నాలుగు లక్షలు కోట్లకు లెక్కలు లేవు. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఏ ఉన్నతాధికారి వచ్చినా ముందుండేది రాష్ట్రంలో ఉన్న లక్షా పది వేల అంగన్వాడి సిబ్బంది మాత్రమే..

అటువంటి వారి సమస్యలపై మానవత్వం లేకుండా.. కనికరం లేకుండా.. తన పరిదిలోనికి రాదన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తించడం భాదాకరం.*

చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నారు.

*ఈ కార్యక్రమంలో నాయకులు వీరంకి గురుమూర్తి , శంకర్ బాబు ( మార్కెట్ యార్డ్ చైర్మన్), చాట్ల రమేష్ (పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ), జువ్వ వేణు (పార్లమెంట్ సెక్రెటరీ) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE