నర్సాపురం పిలుస్తోంది

ప్రతి పల్లె మాతృమూర్తి లాంటిది.ప్రజలందరిపై ఎంతో మమకారం. పండగకు తనవారినందరినీ ఒకసారి చూసుకోవాలని ఆపేక్ష…

ఆ నాలుగు రోజులు తనతో అంటే ఆ మట్టితో, ఆ గాలితో, ఆ నీటితో గడిపిన క్షణాలు తలచుకుంటూ… సంవత్సరమంతా గడిపేస్తుంది. ఈమధ్యలో ఎవరైనా అడిగితే వారి చదువులు, వ్యాపకాలు ముఖ్యం కదా, ఈ పల్లెటూరులో నేనేమి ఇవ్వగలను ఆని తనే సర్దిచెబుతుంది..

మరి అలాంటప్పుడు ఆ పెద అమిరం, ఆ భీమవరం, ఆ నర్సాపురం ఎంత వ్యధ అనుభవిస్తున్నాయో ! తన ముద్దు బిడ్డ, ఈ ప్రాంత ఎంపీ రఘు ను చూచి నాలుగు సంవత్సరాలు అయింది… ఎప్పుడు చూస్తానా అని, కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నది…

హస్తినకు ఎవరు పోయివచ్చినా, తన బిడ్డ గురించే వాకబు. క్షేమంగా ఉన్నారు చాలు అని సరి పెట్టుకోవడం. మొన్నటికి మొన్న తిరుపతి ఫోటోలు చూచి తనే వైకుంఠ దర్శనం చేసుకున్నంత సంతోషం.
నిన్ను చూడాలని ప్రతిరోజూ బెంగతో కన్నీరు. టీవీలో రచ్చబండ చూచి తనకు తనే ఓదార్పు. స్థానికంగా ఉండి తల్లి గురించి పట్టించుకోని ఎంపీల కంటే, తన కొడుకు ఎంతో గొప్ప అని మురిపెం. ఢిల్లీలో నీ పనులు, ఫోటోలు చూసి ఎంత సంతోషమో…

రచ్చబండ అంటే పల్లెఒడి. తన కొడుకు రచ్చబండ కార్యక్రమంలో ఉంటే తన ఒడిలో ఉన్నట్లే అని వూరంతా కలియతిరిగి చెబుతుంది.
తన కొడుకు రాకకై వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నదా ఆ పల్లె తల్లి…

ఆ పల్లె తల్లి దీవెనలతో అఖండ విజయంతో ఎంపీ గా తల్లి ఋణం తీర్చుకోవాలని

నర్సాపురం పార్లమెంట్ నియోజక వర్గం ప్రజలు!

Leave a Reply