– ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పే కెసిఆర్.. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించారు
– ఇందుకు కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్తాం
– హైదరాబాద్ ప్లాన్ ఇచ్చిన మేధావి. రచయిత, కవి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్
– 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి
– ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
హైదరాబాద్ తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130 వ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. ముదిరాజ్ జాతిని ఐక్యం చేసిన మహనీయుడు కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ . ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి. అణగారిన వర్గాలకు సంఘాలు ఉండాలి.. హక్కులకోసం పోరాడాలి అని సూచించారు. వారు అందించిన చైతన్యంతో జాతి ఐక్యత పురోగతికి కృషి చేస్తామని ప్రతిన పూనుతున్నాం.
హైదరాబాద్ ప్లాన్ ఇచ్చిన మేధావి. రచయిత, కవి. ఈ బిడ్డ ఇక్కడ పుట్టడం మనకు గర్వకారణం. పార్టీలకు అతీతంగా ముదిరాజ్ లంతా ఐక్యంగా ఉండాలని కోరుతున్నా.
తెలంగాణలో మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి. గజ్వేల్ లో ముదిరాజ్ ఓట్లతో గెలిచిన కెసిఆర్. ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పే కెసిఆర్.. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించారు, ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇందుకు కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్తాం… కెసిఆర్ ను గద్దె దించుతాం అని ముదిరాజ్ జాతి ప్రతిన పునారు. అది చేసి చూపిస్తాం అని ఈటల రాజేందర్ అన్నారు.