Suryaa.co.in

Telangana

నిజాం నవాబు పాలనలోనే కొనసాగుతున్నామా..?

– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో పౌరులకు కల్పించిన కనీస హక్కు.. తెలంగాణలో ఆ హక్కు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది.నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్న లీకు వీరులు, వారి వెనకున్న పెద్ద తలకాయలను పట్టించుకోని పోలీసులు నిరసన తెలుపుతున్న వారిపై ప్రతాపం చూపడమా..?మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… నిజాం నవాబు పాలనలోనే కొనసాగుతున్నామా..?

మీ బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరే లేరిక్కడ: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు
శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం… దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.అరెస్టులతో బండి సంజయ్ కుమార్ ని, బిజెపిని నిలువరించాలనుకుంటే అవివేకమే అవుతుంది. అరెస్టులు, అక్రమ కేసులు, జైళ్లు మాకు కొత్తేం కాదు… మీ బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరే లేరిక్కడ.నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ సర్కార్ గద్దె దిగాల్సింది పోయి అణిచివేతలకు పాల్పడుతోంది. ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా ఉధృతంగా పోరాడుతాం.తక్షణమే బేషరతుగా బండి సంజయ్ కుమార్ ని విడుదల చేయాలి.. లేకుంటే ప్రజల ఆగ్రహాగ్ని ఈ ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది.

LEAVE A RESPONSE