రోజూ పదివేల అడుగులు…

Spread the love

– తగ్గేదే లే అంటున్న మంత్రి కొడాలి నాని

గుడివాడ, డిసెంబర్ 29: ప్రతిరోజూ పది వేల అడుగులకు ఒక్క అడుగు కూడా తగ్గేదే లే… అంటూ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) నడకను తన దినచర్యలో భాగంగా మలుచుకున్నారు. నడకతో పాటు వామప్ ఎక్సర్సైజులకు మంత్రి కొడాలి నాని ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో దొరికే కొద్దిపాటి సమయంలో 10 వేల అడుగుల నడకను పూర్తి చేయాల్సిందే. మంత్రిగా కొడాలి నాని తన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా హై స్పీడ్ వెహికల్స్ లో, బిజీ షెడ్యూల్స్ మధ్య గడుపుతుంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రెడ్మిల్ పై, గ్రౌండ్ లో అయితే ట్రాక్ పై వాకింగ్ చేయనిదే అయినా దినచర్య ముగియదు. వాకింగ్ ను ఇష్టంగా మల్చుకున్నారో లేక ఆరోగ్యం కోసమో తెలియదుగానీ నడక మంత్రి కొడాలి నాని జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

ప్రతిరోజూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించే మంత్రి కొడాలి నాని మీడియా సమావేశాలప్పుడు మాత్రం అయన ఎనర్జీ లెవెల్స్ పీక్ స్టేజ్ లో కనిపిస్తుంటాయి. ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొంటూ, ఎటువంటి తడబాటు లేకుండా సూటిగా సమాధానాలు ఇచ్చే మంత్రి కొడాలి నాని గ్లామర్ రహస్యం కూడా వాకింగ్ చేయడమేనని ఆయన సన్నిహితులు కూడా చెబుతుంటారు. గత రెండున్నరేళ్ళలో ఇంట్లో రెండు, మూడు ట్రెడ్మిల్ లు మూలనపడ్డాయంటే మంత్రి కొడాలి నాని ఏ లెవల్లో వాకింగ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. కొద్దిరోజుల కిందట కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం ఏలూరు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బ్యాలెన్స్ యునిసెక్స్ జిమ్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కొద్దిసేపు ట్రెడ్మిల్ పై వాకింగ్ చేయడం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది.

Leave a Reply