•తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.43 వేలకోట్లు, ముఖ్యమంత్రిగా ఈ 4 ఏళ్లలో రూ.2లక్షల కోట్లు కొట్టేసిన అవినీతి సామ్రాట్ జగన్
• స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో జరిగింది అంటున్న అవినీతి అంతా జగన్ అతని కబోది మీడియా అభూతసృష్టే
• జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన అవినీతి కోసం 31 షెల్ కంపెనీలు ఏర్పాటుచేశాడని ఈడీ చెప్పింది నిజంకాదా?
• సూట్ కేస్ కంపెనీల నుంచి ఏరకంగా అవినీతి సొమ్ము జగన్ కంపెనీల్లోకి వచ్చిందో మనీలాండరింగ్ లో జగన్ ఎంతటి ఘనుడో సీబీఐ చార్ట్ లు వేసి మరీచెప్పింది నిజంకాదా?
• టీడీపీ ప్రభుత్వంలో నిజంగా అవినీతిజరిగితే, జగన్ ప్రభుత్వం కళాశాలల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని ఎందుకు చెప్పింది?
• టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి వేసిన రెండు కమిటీల్లో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉంటే, వారినెందుకు సీఐడీ విచారించడంలేదు?
• ప్రాజెక్ట్ తో సంబంధంలేని వారికి నోటీసులిస్తూ, అవినీతి మీడియాలో తప్పుడురాతలు రాస్తూ, ప్రజల్ని ఎన్నాళ్లు మోసగిస్తారు?
– చంద్రబాబు పాలనలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2.11లక్షలమందికి శిక్షణఇస్తే, వారిలో 64వేలమంది ఉద్యోగాలు పొందారు
– జగన్ రెడ్డి పాలనలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేశారు.. రాష్ట్రంలో నిరుద్యోగం పెంచారు
– స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఈడీ ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఈడీ చెప్పనిది ఏపీ సీఐడీ అధికారులు ఎలా చెబుతారు?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అవినీతిమురికికూపంలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వం ప్రజలదృష్టి మళ్లిం చడానికే అవినీతిపత్రిక సాక్షిలో తెలుగుదేశంపార్టీపై, చంద్రబాబు, లోకేశ్ లపై బురదజల్లుతు న్నారని, 4ఏళ్లలో ఇసుక, మైనింగ్, మద్యం, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం, లేపాక్షి, విశాఖపట్నం భూకుంభకోణాలతో లక్షలకోట్లు దోచేసినవారు, సిగ్గులేకుండా ఇతరులపై నిందలేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంతసన్నిహితులైన వ్యక్తుల వద్ద బయటపడటంచూస్తే, ఇతరరాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి, అతనిపరివారం, వారి అవినీతి సామ్రాజ్యాలు విస్తరింపచేస్తున్నారని తేలిపోయింది. గతంలో తండ్రి అధికారంతో లక్షలకోట్లు, ఈ 4ఏళ్లపాలనలో తనఅధికారంతో రూ.2లక్షలకోట్లు జగన్ దోచేశాడు. లక్ష లాదియువతకు మేలుచేసేందుకు, వారికుటుంబాలను ఆదుకునేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా రెండేళ్లనుంచి అకారణంగా బురదజల్లుతూనే ఉంది. అదేబాటలో పనికిమాలిన పకోడిపేపర్ కొత్తగా మరికొన్ని తప్పుడు రాతలు వండివార్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ముసుగులో టీడీపీప్రభుత్వం చేసింది అంటున్న అవినీతి మొత్తం కబోదిప్రభుత్వం, కబోది సాక్షి మీడియా అభూతసృష్టే
టీడీపీప్రభుత్వంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పూర్తివిలువ రూ.3,300కోట్లు. ఆ మొత్తం వ్యాల్యుయేషన్ సరైందేనని కేంద్రప్రభుత్వ సంస్థ అయిన C.I.T.D (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) కూడా ధృవీకరించింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కింద 6 సెంట్రల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 34 టీ.ఎస్.డీ.ఐ కేంద్రాలు కలిపిమొత్తం 40 నైపుణ్య శిక్షణ కేంద్రాల్ని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుచేసింది. మార్చి31-2021 నాటికే ఆయాకేంద్రా లద్వారా 2లక్షల11వేల984 మందికి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. వారిలో 64వేలమంది కి ఉద్యోగాలుకూడా లభించాయి. ఆ విధంగా కళ్లముందు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫలా లు కనిపిస్తున్నాకూడా కళ్లుండిచూడలేని ఈ కబోదిప్రభుత్వం, కబోదిసాక్షి మీడియా ఆ ప్రాజెక్ట్ పై విషం చిమ్ముతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.330కోట్ల అవినీతి జరిగితే, శిక్షణాకేంద్రాలు నెలకొల్పిన 40 కళాశాలల యాజమాన్యాలు తమకు శిక్షణకు సంబంధించిన అన్నిపరికరాలు, వస్తువు లు అందాయని స్టాక్ రిజిస్టర్లలోని వివరాలతోకూడిన లేఖలు ఎందుకు ఇచ్చాయి?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి రాష్ట్రంలో ఆప్రాజెక్ట్ కింద ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు జరగలేదని రూ.330కోట్లు అప్పనంగా దోచేశారని సాక్షి మీడియాలో రాశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటుచేసిన 40కళాశాలల నుంచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు తమకళాశాలల్లో ఏర్పాటయ్యాయని, వాటికి అవసర మైన పరికరాలు, సామగ్రిమొత్తం తమకుచేరిందని స్టాక్ రిజిస్టర్లలో వివరాలు నమోదయ్యా యని చెబుతూ లేఖలు కూడా వచ్చాయి.
అలా నైపుణ్యశిక్షణా కేంద్రాలు ఏర్పాటైన కళాశా లల జాబితాలో కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కూడా ఉంది. 40నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంప్రకారం ఆయాకేంద్రాలకు చేరాల్సినవన్నీ చేరాయని స్పష్టంగా కళాశాలల యాజమాన్యాలే లేఖలురాస్తే, అవినీతి జరిగిందని జగన్ అతని అవినీతి మీడియా ఎలాచెబుతుంది? కళాశాలల యాజమాన్యాలు రాసినలేఖలు, ఆయాకేంద్రాల్లో శిక్షణపొందిన 2లక్షల11వేలమంది యువతీయువకులు, ఉద్యోగాలు పొందిన 64వేల మంది మీడియాకు కనిపించలేదా? వారితోపాటు కరోనాసమయంలో, ఈప్రభుత్వంలోనే మరో18 వేలమంది ఆన్ లైన్ ద్వారా కూడా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాల్లో ఉపాధిశిక్షణ పొందా రు. ఇన్నివాస్తవాలు కళ్లకుకట్టినట్టు కనిపిస్తుంటే, వైసీపీనేతలు, సాక్షిమీడియా అసత్యాలు, అబద్ధాలు చెప్పడంసిగ్గుచేటు. జగన్ ప్రభుత్వం చెబుతున్న ఆడిట్ తాలూకా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పచ్చిఅబద్ధమని శరత్ అసోసియేట్స్ సంస్థే చెప్పింది. ప్రభుత్వం తమను తొలుత కళాశాలలకు వెళ్లి ఫిజికల్ వెరిఫికేషన్ చేయమన్నదని, తరువాతవద్దని చెప్పిందని సదరుసంస్థ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో పేజీనెం-12లో స్పష్టంగా చెప్పింది. టీడీపీప్రభుత్వంలో నిజంగా అవినీతిజరిగితే, జగన్ ప్రభుత్వం కళాశాలల్లో ఫిజికల్ వెరిఫి కేషన్ చేయవద్దని శరత్ అసోసియేట్స్ సంస్థకు ఎందుకు చెప్పింది?
షెల్ కంపెనీలసృష్టిలో, మనీలాండరింగ్ లో జగన్మోహన్ రెడ్డే భారతదేశంలో మేటి అని ఈడీ, సీబీఐలు ఆధారాలతో సహా రుజువుచేశాయి. అలాంటి వ్యక్తి, అతనిచేతిలోని అవినీతి మీడియా, షెల్ కంపెనీలతో టీడీపీ అవినీతిచేసిందని చెప్పడం విడ్డూరాలకే విడ్డూరం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిసొమ్ముని షెల్ కంపెనీలద్వారా సింగపూర్ కు మళ్లించి, వాటిని తిరిగి టీడీపీపెద్దల ఖాతాల్లోకి వచ్చేలా చేశారని, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నలోకేశ్ పర్యవేక్షించాడని రాశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో నారాలోకేశ్ కి ఏమాత్రం సంబంధంలేదన్నది వాస్తవం. కేవలం ఇప్పుడు లోకేశ్ యువగళంయాత్రతో తనకు, తనప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి, తన అవినీతిపత్రికద్వారా జరగని అవినీతిలో లోకేశ్ పేరు ప్రస్తావిం చాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తాలూకా అవినీతిసొమ్ము ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లిం దో ఏపీ సీఐడీ ఎందుకు తేల్చలేదు? షెల్ కంపెనీల ద్వారా అవినీతిసొమ్ము టీడీపీపెద్దలఖాతా ల్లోకి వెళ్లిందనిగానీ, రూపాయి అవినీతి చంద్రబాబు, లోకేశ్ లు చేశారనిగానీ ఈడీ ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పిందా? కేంద్రప్రభుత్వ దర్యాప్తుసంస్థ ఈడీకంటే ఏపీ సీఐడీ సమర్థవంతమైందా?
షెల్ కంపెనీల సృష్టిలో, మనీలాండరింగ్ ప్రబుద్ధులజాబితాలో జగన్మోహన్ రెడ్డే దేశంలో నెంబర్ 1 వ్యక్తి అని ఈడీ చెప్పింది. 31 షెల్ కంపెనీలతో జగన్ తనఅవినీతి సామ్రాజ్యాన్ని ఖండాంతరాలు దాటించాడన్న ఈడీ నివేదికలపై వైసీపీఎంపీ మార్గాని భరత్ ఏం సమాధానం చెబుతాడు? టీడీపీనేతలు షెల్ కంపెనీలతో రూ.300కోట్లు దోచేశారు అంటున్న మార్గాని భరత్, ఆకంపెనీలు ఎక్కడున్నాయో, ఆసొమ్ము ఎటునుంచి ఎటువెళ్లిందో ప్రజలకు చెప్పాల ని డిమాండ్ చేస్తున్నాం. భరత్ గానీ, వైసీపీనేతలుగానీ, బుద్ధి, జ్ఞానంలేని మాటలు, అవాస్తవాలతో ప్రజల్ని ఎక్కువకాలం నమ్మించలేరు. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సండూర్ పవర్, సరస్వతి సిమెంట్స్, క్లాసిక్ రియాలిటీ సంస్థలకు డబ్బు ఎక్కడనుంచి ఎక్కడికివచ్చిందో జగన్ కు, భరత్.. వైసీపీనేతలకు తెలియదా? జగన్ కే భారీలబ్ధిపేరుతో పత్రికల్లో వచ్చినకథనాలకు ఏం సమాధానం చెబుతారు? వాన్ పిక్ ద్వారా రాజశేఖర్ రెడ్డి తనకుచేసిన లబ్ధికిగాను, నిమ్మగడ్డప్రసాద్ సండూర్ పవర్ సంస్థకు రూ.144 కోట్లు, భారతిసిమెంట్స్ కు రూ.244కోట్లు, జగతి పబ్లికేషన్స్ లోకి రూ.100కోట్లు, కార్మెల్ ఏషియాలోకి రూ.20కోట్లు మళ్లించింది నిజమా..కాదా?
అలానే పీ.వీ.పీ జగతి పబ్లికేషన్స్ లోకి రూ.146కోట్లు, అలానే చెన్నైకిచెందిన జడ్.ఎం.ఇన్ఫోటెక్ సండూర్ పవర్ లోకి రూ.533కోట్లు, టూ.ఐ.కేపిటల్ సంస్థ రూ.124కోట్లు సండూర్ పవర్ లోకి మళ్లించింది వాస్తవ మా ..కాదా? ఈ విధంగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలకోట్లు రాబ ట్టింది నిజంకాదా? మనీ లాండరింగ్, మనీట్రైల్ లో కూడా మనరాష్ట్ర ముఖ్యమంత్రే సిద్ధహస్తుడని సీబీఐ స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి మనీలాండరింగ్ కు సంబంధించి సీబీఐ పెద్ద ఛార్టే వేసింది. విజయ సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలసొమ్ముకొట్టేసి, విదేశాల్లో కొన్నిషెల్ కంపెనీలుపెట్టి, వాటిద్వారా ఆసొమ్ముని సండూర్ పవర్ సంస్థలోకి మళ్లించి, దాన్నితిరిగి ఎక్సల్ ప్రోసాఫ్ట్, సిగ్మా ఆక్సిజన్ లిమిటెడ్, నెల్ క్యాస్ట్ ఫైనాన్స్, కీలాన్ టెక్నాలజీస్ కు దారిమళ్లించిన వైనా న్ని వివరిస్తూ సీబీఐ బ్రహ్మండంగా పెద్ద బొమ్మేవేసింది. సీబీఐ ఛార్ట్ ను ఫ్రేమ్ కట్టి పంపిస్తాం. మీ ముఖ్యమంత్రి ఇంట్లో, మీపార్టీ కార్యాలయాల్లో గోడలపై అతికించుకోండి. తండ్రి, కొడుకులు కలిసి ఏరకంగా ప్రజలసొమ్ముకొట్టేసి, దాన్ని ఏరకంగా విదేశాలకు పంపి, తిరిగి వారికంపెనీలకు మళ్లించారో జాతీయ, అంతర్జాతీయ మీడియాసంస్థలు పుంఖానుపుం ఖాలుగా రాశాయి. ఇంతటి అవినీతిచరిత్ర కలిగినమీరు, ఎదుటివారిపై నిందలేస్తున్నారు. గతంలో తండ్రి అధికారంతో కొట్టేసిందిచాలక, ఈ నాలుగేళ్లలో తనముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి రూ.2లక్షలకోట్లు కొట్టేశాడు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి టీడీపీప్రభుత్వం వేసిన రెండుకమిటీల్లో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల్ని వదిలేసి, ఏపీ సీఐడీ సంబంధంలేని వారికి నోటీసులిస్తోంది
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జగన్ రెడ్డి, అతని అవినీతిమీడియా జరిగింది అంటున్న అవినీతి కొన్నికంపెనీల పన్నుఎగవేతకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. దానిలో తెలు గుదేశానికి, మా నాయకుడు చంద్రబాబునాయుడికి, లోకేశ్ గార్లకు ఎలాంటి సంబంధంలేదు. ఒక షోరూమ్ కు వెళ్లి, టీవీనో, ఫ్రిజ్జో కొంటే, సదరు షోరూమ్ వారు ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ముకట్టకుండా ఎగ్గొడితే, వస్తువుకొన్న కొనుగోలుదారుడికి ఏం సంబంధం ఉంటుంది? అలానే స్కిల్ డెవ లప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి, సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందంచేసుకంటే, ఆ ఒప్పందంప్రకారం సదరుసంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్ష ణా కేంద్రాలకు అందించాల్సిన వస్తువులన్నీ అందించాక, కేంద్రాలు వాటికార్యకలాపాలు ప్రారంభించాక, సదరు సంస్థ ఎక్కడో ఏదో పన్నుఎగ్గొడితే టీడీపీప్రభుత్వానికి ఏమిటి సంబంధం? తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిందంటున్న అవినీతికి సంబంధించి అర్జా శ్రీకాంత్ కు నోటీసులిచ్చారు. మార్చి2019లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లోకి శ్రీకాంత్ వచ్చేనాటికే ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్నిలావాదేవీలు పూర్తై, అగ్రిమెంట్ ప్రకారం పరికరాలు కళాశాలలకు చేరుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి అంటే ముందు టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలుచేసుకున్నప్పుడు ఉన్న ఐపీఎస్ అధికారులకు ఇవ్వాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి టీడీపీప్రభుత్వం వేసిన రెండు కమి టీల్లో సదరుఅధికారులు సభ్యులుగాఉన్నారు. ఆ అధికారులే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే ఉన్నతస్థానాల్లో ఉన్నారు. అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్, ప్రేమచంద్రారెడ్డి లాంటి ఐఏఎస్ లకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చి విచారిస్తే, వాస్తవాలు బయటకువస్తాయి.
ఈ తంతు మొత్తం చూస్తే జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, వారి అవినీతిమీడియా కావాలనే టీడీపీపై, చంద్రబాబు, లోకేశ్ లపై బురదజల్లుడు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. గతంలో ఇలానే చంద్రబాబు ఆయన కుటుంబం 6లక్షలకోట్ల అవినీతికి పాల్పడిందని పుస్తకాలు వేసిన జగన్ రెడ్డి, 6పైసల అవినీ తిని కూడా నిరూపించలేక చతికిలబడ్డాడు. ఆధారాలులేకుండా అవినీతిఆరోపణలు చేయడం పరులపై నిందలేయడం జగన్ కు అవినీతిసొమ్ముతో అబ్బినవిద్య. ఈడీకేసులు, సీబీఐ కేసుల్లో 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తి, సిగ్గులేకుండా మచ్చలేని చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. జగన్, వైసీపీనేతలు ఎంతగొంతు చించు కున్నా రవ్వంత అవినీతిని కూడా చంద్రబాబుకి, ఆయన కుటుంబానికి అంటించలేరు. యువత భవిష్యత్ కోసం ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్ని జగన్ తన స్వార్థం కోసం నాశనంచేశాడు. 2024లో టీడీపీ అధికారంలోకివచ్చాక, రాష్ట్రంలో నిజమైన ఉద్యోగ కల్పన ఎలాఉంటుందో చంద్రబాబు, లోకేశ్ లు ఆచరణలో చేసిచూపిస్తారు.
నిజమైన జాబ్ క్యాలెండర్ జనవరి 2025న విడుదలచేసి, లక్షలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు. అదేవిధంగా నేడు జగన్ రెడ్డి అటకెక్కించిన 40స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను తిరిగి పట్టాలెక్కించి, నిరుద్యోగయువతకు అత్యుత్తమైన నైపుణ్యశిక్షణ అందించి, ఉద్యోగావకా శాలు కల్పిస్తారు ” అని పట్టాభిరామ్ స్పష్టంచేశారు.