Suryaa.co.in

International

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో 20 మంది జర్నలిస్టులు మృతి

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ తన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ విషయాన్ని తెలిపింది.మృతిచెందిన జర్నలిస్టుల పేర్ల జాబితాను ఆ యూనియన్ ప్రకటించింది. ఆ మృతుల జాబితాను ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు ద్రువీకరించింది. మృతిచెందిన జర్నలిస్టుల్లో విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్‌కు మరోసారి భారీగా ఆయుధాలను అమెరికా సరఫరా చేయనున్నది. సుమారు 750 మిలియన్ డాలర్ల ఖరీదైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు వైట్‌హౌజ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE