– గంటలపాటు ట్రాఫిక్ నిలిపివేశారంటున్న తలిదండ్రులు
– దానితో 30 మంది పరీక్ష మిస్సయ్యారంటూ తలిదండ్రుల వేదన
-సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న తలిదండ్రుల వీడియోలు
– అదంతా ఉత్తిదేనంటున్న విశాఖ పోలీసులు
– పరీక్ష తర్వాతనే పవన్ కాన్వాయ్ బయలుదేరిందని వాదన
విశాఖ: ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన, పాపం మంది జేఈఈ విద్యార్ధులు పరీక్ష మిస్సయ్యేందుకు కారణమయింది. పవన్ కాన్వాయ్ హడావిడి వల్ల ట్రాఫిక్‌ను గంటలపాటు నిలిపేశారని, అందువల్ల తమ పిల్లలు పరీక్షకు లేటుగా హాజరయ్యారని, చివరకు పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారంటూ.. 30 మంది విద్యార్థుల తలిదండ్రులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
ఇప్పుడు ఆ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అదంతా అబద్ధమని, పరీక్షలు ప్రారంభమైన తర్వాతనే, పవన్ కాన్వాయ్
బయలుదేరిందన్నది విశాఖ పోలీసుల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా.. నష్టపోయిన ఆ విద్యార్ధుల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన భాగంగా విశాఖపట్నం నుండి అరకు వెళ్తున్న సీఎం కాన్వాయ్ వెళ్తున్న భాగం గా చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది . దీంతో చిన్న ముసిరివాడ లో అయాన్ డిజిటల్ సెంటర్ వెళ్ళవలసిన విద్యార్థులకు ఆలస్యం అయ్యింది. జీ మెయిన్స్ పరీక్ష ఎంట్రీ సమయం ముగియగా అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు, పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్ కారణంగా పరీక్ష మిస్ అయ్యామని విద్యార్థులు 30 మంది పేరెంట్స్ కంట తడి పెట్టుకున్నారు.
అదంతా అబద్ధమంటున్న పోలీసులు
పెందుర్తిలోని చిన ముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ జోన్ భవనంలో ఉన్న రెండు పరీక్షా కేంద్రాలకు 1వ షిఫ్ట్ (రోజువారీ పరీక్షలు 2 షిఫ్ట్‌లలో జరుగుతాయి) కోసం కొంతమంది మెయిన్స్ (మెయిన్స్) పరీక్ష అభ్యర్థులు ఆలస్యంగా రావడానికి డిప్యూటీ సీఎం పర్యటన సంబంధించి విశాఖ నగర పోలీసులు చేసిన రూట్ బందోబస్తు పై నిందలు వేయబడుతూ సందేశాలు మరియు వీడియోలు ప్రచారం చేయబడుతున్నాయని గమనించబడింది, సదరు ప్రచారం పూర్తిగా అవాస్తవం ఎందుకంటే:
1. పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డ్ ప్రకారం, ప్రతీ అభ్యర్థి ఉదయం 07:00 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్షా కేంద్రం యొక్క గేట్ ఉదయం 8:30 గంటలకు మూసివేయబడుతుంది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదరు జంక్షన్ గుండా వెళ్ళింది.
కాబట్టి, ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలికకూ, ఉదయం 7:00 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది.
2. అంతేకాకుండా, ఏప్రిల్ 02న ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76 మరియు 61 మంది గైర్హాజరైన అభ్యర్థుల సంఖ్య (ఆలస్యంగా వచ్చిన వారితో సహా) ఉంది, అంటే గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య (ఆలస్యంగా వచ్చిన వారితో సహా) ఈ రోజు తక్కువగా ఉంది.
3. పరీక్షార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పైన పేర్కొన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 08:30 గంటల వరకూ బిఆర్‌టిఎస్ రోడ్డు మరియు గోపాలపట్నం – పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్‌ను నిలిపివేయలేదు.