– ప్రజలకు ఉపయోగపడని నీ అనుభవం ఎందుకు బాబూ..?
– నువ్వే అన్నీ అభివృద్ధి చేసి ఉంటే .. 23 సీట్లు ఎందుకొస్తాయ్..?
– ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యం
– మేం ఉత్తరాంధ్ర స్థితిగతులను మార్చబోతున్నాం
– 30 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పూర్తి
– అదానీ డేటా సెంటర్ ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు
– నువ్వు దొంగతనం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా బాబూ ..?
– రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి అమరావతిలో వ్యాపారం చేయాలనుకున్నావ్
– ఎక్కడ జైళ్లో పెడతారన్నదే చంద్రబాబు భయం
– ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీనే దొంగిలించిన ఘనుడు చంద్రబాబు
– అన్నీ చేశాం కాబట్టే ధైర్యంగా ఆశీర్వదించమని కోరుతున్నాం
– చంద్రబాబుకు 2019లో పట్టిన గతే 2024లోనూ పడుతుంది
– రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు జగన్ మాత్రమే
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
జగన్ నాయకత్వంలో ఉత్తరాంధ్ర స్థితిగతులు మారబోతున్నాయి:
– భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.4500 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేశారు.
– 24 నెలల నుంచి 30 నెలలోపు మొదటి విమానాన్ని ల్యాండ్ చేయాలని సిఎం టార్గెట్ ఫిక్స్ చేశారు.
– రూ.20 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో అదాని డేటా సెంటర్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
– దీని ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా 300 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు.
– ఉత్తరాంధ్ర ప్రాంతం ముఖచిత్రాన్ని మార్చేవిధంగా, ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ పాటుపడుతున్నారు.
– ఈ మూడు ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో ప్రజల స్థితిగతులు మారబోతున్నాయి.
రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి అమరావతిలో వ్యాపారం చేయాలనుకున్నారు:
– చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి.. ఇతర స్కాములపై.. 2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
– అనేక అక్రమాలపై సమీక్షించమని చెప్పారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది.
– అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు రాజధాని ప్రకటనకు ముందే భూములు సమకూర్చుకున్నారు.
– రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి వ్యాపారం చేయాలని చంద్రబాబు, ఆయన దొంగల ముఠా ప్రయత్నించింది.
-విచారణ వేస్తే.. మేం కక్షసాధింపులకు దిగామని చంద్రబాబు విమర్శించాడు.
– సుప్రీం కోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది.
– అవసరమైతే సీబీఐ, ఈడీ లాంటి ఎజెన్సీలను కూడా ఇంప్లీడ్ కావచ్చని మేం ఆరోజే చెప్పాం. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది.
– విచారణ చేయాలని, అక్రమాలు, అన్యాయాలను ప్రజలు ముందు పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పింది.
– అవసరమైతే ఇందులో ఉన్న దోషులను శిక్షించాలని చట్టం చెప్తోంది.
నువ్వు దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ..?:
– చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటే సీబీఐ, ఈడీ రావడానికి వీల్లేందంటాడు.
– ఆనాడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, పారిపోయి వచ్చి కరకట్ట మీద దాక్కున్నాడు.
– ఆ రోజు నాకు ఏసీబీ ఉందన్నాడు..నా ఫోన్ రికార్డు చేయడానికి ఎవరిచ్చారు అధికారం అన్నాడు..
– నువ్వు దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా..?
– ఏలేరు స్కాం నుంచి మొదలుకుని స్టాంప్ పేపర్ల కుంభకోణం వరకూ చంద్రబాబు తీరు అందరికీ తెలుసు
– చివరికి తాను ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీని కూడా దొంగతనం చేశాడు.
– మళ్లీ విచారణ మొదలవుతుంది..తమను ఎక్కడ జైళ్లో పెడతారో అనే భయంతో ఈ రోజు చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు
– సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నాడు.
అన్నీ నీ వల్లే అయితే 23 సీట్లు ఎందుకొస్తాయ్ బాబూ..?:
– భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్ నా వల్లే అంటున్నాడు.
– మొన్నటి మూలపేట పోర్టు శంకుస్థాపన చేస్తే.. అదీ నేనే అంటున్నాడు..
– హైదారబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్ రోడ్డు నేనే అంటాడు.
– హైదరాబాద్ ఎయిర్ పోర్టు కట్టిన డెవలపర్ గ్రంథి మల్లిఖార్జునరావు దాన్ని ఎవరు కట్టారో ఈ రోజు సభలో స్పష్టంగా చెప్పారు.
– 2005లో రాజశేఖరరెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారని జీఎంఆర్ స్పష్టంగా చెప్పారు.
– 2008లో దాన్ని రాజశేఖరరెడ్డి ప్రారంభోత్సవం చేశారని డెవలెపర్ స్పష్టంగా చెప్తుంటే చంద్రబాబు మాత్రం నేనే అంటాడు.
– ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టును జగన్ శంకుస్థాపన చేశారు..ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయాలని జీఎంఆర్ ఆకాంక్షించారు.
– మరో 30 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించబోతున్నాం.
– భోగాపురం ఎయిర్‌పోర్టుకు మీరేం చేశారు..? భూముల సేకరణ కూడా చేయలేదు.
– ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లేదు. నిర్వాసితులను అక్కడ నుంచి తరలించిందీ లేదు.
– సివిల్ ఏవియేషన్ అనుమతులు తీసుకురాలేదు. ఎన్జీటీలో ఉన్న కేసులను పరిష్కారం దిశగా ప్రయత్నం చేయలేదు.
– ఆనాటికి భూములు లేవు..డెవలెపర్ కూడా లేడు.
– కేవలం ఎన్నికలకు 15 రోజుల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి బాబు శంకుస్థాపన చేశాడు.
ఆనాడు కనీసం భూములు కూడా చూపకుండా శంకుస్థాపనలు:
– భావనపాడు పోర్టు పేరు మూలపేట పోర్టు కింద మార్చేశారని బాబు విమర్శిస్తున్నాడు.
– భావనపాడు గ్రామానికి సంబంధించి ఒక్క ఎకరం భూమిని కూడా తీసుకోలేదు.
– భావనపాడు నుంచి మరికొంత కిందివైపునకు వచ్చి మూలపేట–విష్ణుచక్రం గ్రామాల్లో ఏర్పాటు చేశాం.
– అక్కడున్న రైతులు భూములిచ్చి తమ ఊరు పేరు పెట్టమని కోరారు.
– భావనపాడు గ్రామం నుంచి ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోకుండా ఆ ఊరి పేరు పెట్టడం సమంజసం కాదని వారు అన్నారు.
– ముఖ్యమంత్రి ఆలోచన చేసి, నిర్వాసితులు అవుతున్న వారి గ్రామాల పేరు పెట్టాలని మూలపేట పోర్టు అని నామకరణం చేశారు
– అదానీ డేటా సెంటర్ కూడా నేనే శంకుస్థాపన చేశాను అంటాడు. దానికి కనీసం భూమి ఎక్కడో కూడా చూపించలేదు.
– చంద్రబాబు తన పరిపాలనలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నాడు.
– ఆ రూ.16 లక్షల కోట్ల పెట్టబడులు ఎక్కడొచ్చాయో చూపించండి. దానిలో కనీసం రూ.45 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు.
ఎవర్ని మోసం చేయడానికి నీ ఏడుపు చంద్రబాబూ..?:
– ఎవర్నిమోసం చేయడానికి చంద్రబాబు ఇలాంటి ఆబద్ధాలు చెప్తున్నాడు..?
– సుప్రీం కోర్టు ఆర్డర్ నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు బాధ, ప్రస్టేషన్, ఏడుపు అంతా..
– ప్రజల వద్ద సింపతీ పొందడం కోసం, దీన్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు ఏడుపంతా..
– మొన్నటి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలందరూ వచ్చారు.
– వారు రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చెప్పారు.
– పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి అని బాబు అంటున్నారు.
– 2022 జనవరి నుంచి నవంబర్ వరకూ దేశంలో అత్యధిక పెట్టబడులు ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
– గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్ గా ఉంది.
– లీడ్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మౌళిక వసతుల కల్పనలో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉంది.
– మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్, 50 వేల ఎకరాల పారిశ్రామిక భూములు అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీ అగ్రగామిగా నిలిచింది.
– 6 పోర్టులు ఉన్న రాష్ట్రంగా, మరో 4 పోర్టులు నిర్మాణం జరుగుతున్న రాష్ట్రంగా పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యం:
– చంద్రబాబు ఏడుపంతా ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికి మాత్రమే.
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయాడు.
– జగన్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో తమకు రాజకీయంగా నష్టం కలుగుతుందని ఏడుపులు ఏడుస్తున్నాడు.
– మీరంత బాగా చేసి ఉంటే మీకు 23 సీట్లు ఎందుకు వస్తాయి..?
– మీరు ఆనాడే భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టి ఉంటే..ఉద్దానం కిడ్నీ రీసెర్చి సెంటర్ కట్టి ఉంటే 23 సీట్లు ఎందుకొస్తాయి..?
– గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో నేడు అభివృద్ది కార్యక్రమాలు సాగుతున్నారు.
– విశాఖ నగరాన్ని దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా నిలబెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేసింది.
– దేశంలోని టాప్ 10 సిటీలలో విశాఖపట్నం నేడు ఒకటిగా ఉంది.
– జీఎస్‌డీపీ గ్రోత్ రేట్‌లో దేశం సరాసరి కంటే మనం 11.43 శాతంతో మందుకెళ్తున్నాం.
– చంద్రబాబు చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. కానీ మేం ప్రజలకు ఎక్కువ మంచి చేశాం.
– చంద్రబాబు చేసిన అప్పులు ఏమయ్యాయో కూడా తెలియదు.
ప్రజలకు మేలు చేయని మీ అనుభవం ఎవరికి కావాలి..?:
– సంక్షేమం గురించి మాట్లాడితే..పరిశ్రమల సంగతి ఏమిటి అంటాడు
– పరిశ్రమల గురించి మాట్లాడితే..వ్యవసాయం ఏమిటి అంటాడు..
– మేం అన్నీ చేశాం కాబట్టే ప్రతి కుటుంబం వద్దకు ధైర్యంగా వెళ్లి ఆశీర్వదించమని కోరుతున్నాం
– చంద్రబాబునాయుడికి ఆ ధైర్యం లేదు…14 ఏళ్లు నేను ఏమీ చేయలేదు..నాకు ఓట్లేయండి అని అడుగుతాడా..?
– 45 ఏళ్లు ఇండస్ట్రీ అని, నాకు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని.. నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.
– చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నాడనేది ప్రజలు చూస్తారు.
– 45 ఏళ్ల ఇండస్ట్రీ, మామను వెన్నుపోటు పొడిచాను అంటే ప్రజలు వినరు
– నేను ఒంటరిగా గెలవలేను..నన్ను ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్లాలి అంటే కుదరదు.
– ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడని మీ అనుభవం ఎవరికి కావాలి..?
– ప్రజలకు అన్నీ తెలుసు…2019లో పట్టిన గతే 2024లోనూ పడుతుంది.
– రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు జగన్ మాత్రమే.
ఈ రోజు నుంచీ విచారణ వేగవంతం అవుతుంది:
– మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టే.. మేం చట్టప్రకారం వ్యవహరించాం.
– ఏ విచారణలు చేయడానికి వీళ్లేదు..మమ్మల్ని ఎవరూ అడగడానికి వీళ్లేదు అంటూ స్టే తెచ్చుకున్నాడు.
– ఏమీ రాకముందే మీరెందుకు గాబరా పడుతున్నారు. అన్నీ విచారణలు చేయాలని సుప్రీం కోర్టు ఈ రోజు స్పష్టంగా చెప్పింది.
– ఈ రోజు నుంచీ విచారణ వేగవంతం అవుతుంది.
– గీతం కాలేజీ వారు 38 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించి భవనాలు కట్టేశారు. ఇలాంటవన్నీ బయటకు వస్తాయి.
– మేం వచ్చిన తర్వాత 400 ఎకరాలు బయటకు తీశాం. రాష్ట్రంలో జరిగిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే సిట్ వేశాం.
– ప్రతి విషయంలో స్టేలతో ముందుకెళ్లడం చంద్రబాబుకు అలవాటు..కొంత కాలం ఉపశమనం దొరికింది.
– ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్డర్‌ఇచ్చింది. విచారణ కొనసాగుతుంది.
– హెచ్‌ఎస్‌బీసీ ఇక్కడే కాదు..బెంగుళూరులో కూడా వారి కార్యకలాపాలను తగ్గించుకున్నారు.
– చంద్రబాబునాయుడు కూడా పారిశ్రామిక వేత్తే. ఆయనా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్నాడు.
– ఏపీలో ఆయనకు పదికి పైగా పరిశ్రమలు ఉన్నాయి.
– ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయేమో చెప్పమనండి.
– రాష్ట్రానికి వస్తున్నవన్నీ పెద్ద సంస్థలు…వారు చెప్పే మాటలు వినండి…వాస్తవాలు మీకే తెలుస్తాయి.
– ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదు..రాజకీయ అవసరాలు ముఖ్యం అని చంద్రబాబు అంటున్నాడు.
– రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని కూడా ఫణంగా పెట్టే ఘనుడు చంద్రబాబు.
– ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు అనుకునే వ్యక్తి చంద్రబాబు.