పరస్పర అంగీకారం
పరస్పర అధికారం కాదు
పెళ్లి అంటే…
పరస్పర ఒప్పందం నిర్బంధం కాదు
పెళ్లి అంటే…
తానో జీవిత కాల నేస్తమవ్వడం
నేనే సమస్తమనడం కాదు
పెళ్లి అంటే…
మరో జీవితంతో దర్జాగా కలిసి బ్రతకడం, మరో జీవితాన్ని కబ్జా చేయడం కాదు
పెళ్లి అంటే…
గెలిపించుకోవడం
బెదిరించుకోవడం కాదు
పెళ్లి అంటే…
పిల్లల్ని కనడం కాదు
కలల్ని పండించుకోవడం
ఎవ్వరికీ ఇబ్బంది పెట్టని వ్యక్తి స్వేచ్ఛను హరించాలని చూస్తే పెళ్లి కన్నా పెటాకులే వేడుకవుతుంది…
గదిలో కాపురం కన్నా వీధిలో సంబరమే కానుక అవుతుంది.
ఫైనల్ గా..
పెళ్లి గొప్పదే కానీ జీవితం అంత కన్నా గొప్పది.
– రామకృష్ణ యడవల్లి