– ఎంపీ విజయసాయి రెడ్డి
ఫిబ్రవరి 18: ఈ ఏడాది మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో అత్యధికంగా 72.54 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయనున్నట్లు, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 6.23 లక్షల మంది పదో తరగతి విద్యార్దుల్లో 4.51 లక్షల మంది ఇంగ్లీష్ లోనే పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇదేళ్లలో 25 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారారని చెప్పారు.