రానున్న ఎన్నికల్లో పొత్తులు లేకుండా సింగిల్‌గా రమ్మని వైసీపీ నేతలు, మంత్రులు తెలుగుదేశం పార్టీకి విసురుతున్నారు. సవాళ్లు బాగానే ఉంది. పవన్ కల్యాణ్ టీడీపీతో జత కట్టకుండా ఇప్పటినుంచే రెచ్చగొట్టే పని ప్రారంభించారు. మంచిదే. వారి నమ్మకాన్ని మెచ్చకుండా ఉండలేం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితికి, వైసీపీ నేతలు, మంత్రుల ధీమాకు ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం కనిపిస్తోంది.
కారణం ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు , కొత్తగా బాదుడే బాదుడుతో విసిగిపోయిన జనం. ఇక వీరుకాకుండా, గత ఎన్నికల్లో నాలుగుచేతులా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించిన ఉద్యోగులు కూడా, తమ చేతులు కాల్చుకుని ఇప్పుడు.. ఎన్నికలెప్పుడా అని ఆబగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రకారంగా అసంతృప్తితో రగిలిపోతున్న వీరంతా ఎంతమంది ఉన్నారు? వీరిలో ఎంతమంది.. ఏ కారణంతో జగనన్నకు ఓటు వేయరో ఓసారి విశ్లేషిద్దాం.
పూర్తిగా.. రుణ మాఫీ చేసేసి.. 1రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేత్తా… అంటే నమ్మి ఓట్లేసిన టిడ్కో ఇళ్ళ లబ్దిదారులు… ఎందుకెయ్యరో… చూద్దామన్నా ?
వాస్తవం :
సుమారుగా… వీళ్ళు 8 లక్షల మంది… రూ.50,000 చొప్పున కట్టేసి… రుణ మాఫీ అవ్వక… ఇళ్ళు పొందక .. ఫ్లవరు మండిపోయి ఉన్నారు.
డ్వాక్రా రుణాలు… మాఫీ చేసేత్తా… అంటే నమ్మి ఓట్లేసిన అక్క చెమ్మలు… ఎందుకెయ్యరో… చూద్దామన్నా ?
వాస్తవం :
సుమారుగా… వీళ్ళు 85 లక్షల మంది… చంద్రబాబు ఇచ్చిన పదివేలు…. మీ బాబు జేబులోఁచి ఇస్తున్నారా అని చాలా మర్యాదగా అడిగారు… మరి.. మన అన్నియ్య… ఫ్యాన్సీ నెంబరు 1234 రూపాయలు ఇచ్చాడు.
సి పి యెస్ రద్దు… చేసేత్తా… అంటే నమ్మి రెండు చేతులతో… ఓట్లేసిన ప్రబుత్వోద్యోగులు… ఎందుకెయ్యరో.. చూద్దామన్నా ?
వాస్తవం :
సుమారుగా… వీళ్ళు 18 లక్షలమంది ఉన్నారు… సిపియెస్ రద్దు పక్కన పెడితే… చంద్రబాబు 43% పి ఆర్ సి ఇస్తే… మన అన్నియ్య… రివర్స్ లో… 24% ఇచ్చాడు… ఏనెల కూడా… జీతాలు టైమ్ కి ఇవ్వలేక పోతున్నాడు… వీళ్ళకి… మామూలుగా మండటం లేదు.
జనవరి లో… జాబ్ కేలండర్… అంటే నమ్మి ఓట్లేసిన… తమ్ముళ్ళు ఎందుకెయ్యరో… చూద్దామన్నా ?
వాస్తవం :
సుమారు… వీళ్ళు 1కోటీ 70 లక్షల మందిలో… గత ప్రభుత్వం లో.. 12 లక్షల మంది నిరుద్యోగ బ్రుతి నెలకి 2000 చొప్పున పొందిన వారు ఉన్నారు… వీళ్ళకి కూడా… ఎక్కడెక్కడో మండిపోయి ఉన్నారు.
కేవలం ఈ… నాలుగు కేటగిరీలు… కలిపితే… సుమారు… 1కోటి 23 లక్షల మంది….
ఈ కోటి.. ఇరవై మూడు లక్షల్లో… సగం ఏసుకున్నా… సుమారుగా… 62 లక్షల మంది….
వీళ్ళకి… అదనంగా… ఓ.టి.యెస్… చెత్తపన్ను… ఆస్తిపన్ను పెంపు… రోడ్లు… కాంట్రాక్టర్ల బకాయిలు… దాన్యం బకాయిలు… రేషన్ కార్డులు కోల్పోయినవారు (సుమారు 10లక్షలమంది) … బ్లా…బ్లా… బాధితులు… బోనస్సులు…
ఇదీ… రేపటి ఎన్నికల.. ఎన్నో కలల బొమ్మ … బ్లాక్ బస్టరే కదా తమ్ముళ్ళూ..
– రామ్మోహన్, జర్నలిస్టు