Home » హిందూ పండుగలతో 80 వేల కోట్ల చెలామణి!

హిందూ పండుగలతో 80 వేల కోట్ల చెలామణి!

– ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అన్నివేల కోట్లు
– ఇక దేశంలో ఎన్ని లక్షల కోట్లు?
హిందువుల పండుగలొస్తే చాలు. ఒక్కోరికీ ఒక్కోర కమైన ఆదాయం. ఒక్కో మార్గంలో ఆదాయం. పూల నుంచి పలుగుపట్టి తవ్వే కార్మికుడి వరకూ ఆదాయమే. ఇలాంటి ఆదాయం పొందే వారిలో క్రైస్తవులు, ముస్లిములు కూడా ఉండటమే విశేషం. పూల వ్యాపారాలు చేసే ముస్లిములకు, హిందూ పండులొస్తే నిజంగా పండుగే. లైటింగ్, డెకరేషన్, డీజే రంగాల్లో ఉన్న క్రైస్తవులకూ హిందువుల పండుగలొస్తే పండుగే. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువుల పండుగలకు అన్ని రకాల వృత్తులు, మతాల వారికి చేతులుమారే డబ్బు అక్షరాలా 80 వేల కోట్ల రూపాయలు. అంటే ఏదో ఒక మార్గంలో పండుగల పుణ్యాన అందరూ బతుకుతున్నారన్న మాట! హిందూ పండుగలను అందరికీ జీవనోపాథి కల్పిస్తోందన్నమాట. ఇదే ఈ దేశం గొప్పతనం. ఆసక్తికరమైన ఈ కథనంలోకి వెళదాం రండి!
ప్రతి హైందవ పండగ వల్ల వివిధ కులవృత్తులవారికి, చేతిపనుల వారికి చిరువ్యాపారులకు ఈకాలం లెక్కల ప్రకారం మన తెలుగు రాష్ట్రాలలో 80 వేల కోట్ల రూపాయల డబ్బు వివిధ రకాలు గా ప్రజలలోకి వెళుతుంది
గణపతి ఉత్సవాల వివరాలలోకి వెళితే వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి,
వారి సహాయకులైన, వారికి మట్టి అందించే వారికి, రంగులు అమ్మేవారికి,రంగులు వేసే వారికి..
మ్యాదర సోదరులు తాటాకు/ వెదురు కర్రలతో వేసేతాత్కాలిక మంటపాలు ద్వారా, షామియానా వారు వేసే టెంట్లు ద్వారా వారికి ఉపాధి దొరికింది.
సన్నాయి, బ్యాండ్ మేళం వారికి. లోపల డెకరేషన్ చేసే వారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్ లకు పని దొరికింది. పువ్వులు పంటల వారికి, కోసే వారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి
దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి.
ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి విగ్రహాలు మంటపాలకు తేవటానికి, మరల నిమజ్జనానికి తీసుకువెల్లటానికి అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి. దాదాపు ప్రతి మంటపం లో అన్నదానాలు జరుగుతాయి. కలిసి భోజనాలు జరుగుతాయి..సమాజం లో సామరస్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కడుపునిండా తినగల్గుతారు..
వంట మనుషులకు, సహాయకులుకు,టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది.
వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే వారికి మంచి ధర కు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు. బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది.
కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజచేసే పత్రి, మామిడాకులు ఇలా వీటిన్నటినీ ఈ రోజుల్లో కొనటమే కనక సన్నకారు రైతులు అందరూ వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది. హరికధలు బుర్రకధలు నాటకాలు ప్రవచనాలు, భరతనాట్యాలు సంగీత కచేరీలు ఆర్కెష్ట్రాలు, ఊరేగింపులలో కోయడాన్సులు భేతాల నృత్యాలు కోలాటాలు, తీన్మారులు తాసాలు రామడోళ్లు నాదస్వర డోలు సహనాయిలు, చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు ఈ వినాయకచవితి పేరుచెప్పకుని తనకుటుంబంతో కలసితృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే. ఆఖరికి కూలిపనికి వెళ్లేవారు బడుగు వర్గాలవారు కూడా నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్ లకు రాడ్ లు ఎత్తే పనికో, పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో, పోతే నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది కూడా ఈవినాయకచవితి కోసమే.
నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం , ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశ పెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే మాకు చాలా గర్వంగా ఉంది.
నేడు సొంత ప్రభుత్వాలు ఉన్నా.. గణేశ నవరాత్రులుకు అనుమతులు తీసుకోవటం అంటే ఆత్మ గౌరవం కల్పించలేని లేని రాజ్యం లో ఉన్నామనే భావన కలుగుతుంది. ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పోటీ పడుతుంటే, మనంమాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో అంటే.. మన పండుగలు వాటివెనుక ఉన్న సంప్రదాయ ఉత్సవాలు ప్రధాన కారణం మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు.
ప్రతి పండగ మనకు ఒక్కో మేలును కల్గిస్తు, ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఒక్క కులమూ గొప్పదే .. ఏ ఒక్క కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు.
గమనిక:- కులం అంటే వృత్తి.
మన భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబంఅనే సిద్దాంతం దాగి ఉంది. ఈ రహస్యం గ్రహించలేని వారు ఒక ఏడాది పాటు పరిశోధన చేసి, ఒకే ఒక్క పండగ జరుపుకుంటూ ఆర్థిక మాంద్యం బారిన పడే వివిధ దేశాలఆర్థిక విధానాల మీద పరిశోధన చేసి చూస్తే తేలిక గా అర్థమౌతుంది
చివరిగా ఒకమాట….
పండగలు ఉత్సవాలలో ధనం ధర్మ బద్ధంగా చందాల రూపం లో సేకరించి దానిని సేవలకు వినియోగం చేయడం ద్వారా అది తిరిగి సమాజం లోకి చేరుతుంది. మనకు మనము పని కల్పించుకుని, సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మ మే, భారతీయ నాగరికత లో మమేకమై ఉన్నది
వాస్తవానికి మతం ఏదైనా మన సంస్కృతి, ఉత్సవాలు అన్ని వర్గాలవారికి చక్కటి బృతి కి దోహద పడుతున్నాయి . కాబట్టి అద్భుతమైన మన జీవన శైలిని మతమౌడ్యం తో చూస్తూ ఆంక్షలు లేక.. నేనే దీనిని రక్షిస్తున్నా.. లేక వ్యాప్తి చేస్తున్నా అన్న పిచ్చిమాలోకాలు తెలిసీ తెలియని వారిని పక్కదోవ పట్టించక.. ఇది భారతీయజీవన విధానం లో గొప్పతనం గా స్వీకరించి ఆదరించి కొనసాగిస్తే, రాష్ట్రానికి దేశానికి ఆర్థిక ఊరట కలుగుతుంది .
ఇపుడు గణపతి ఉత్సవాలు .ఇలానే దసరా …దీపావళి , సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వరుసలో ఉన్నాయి. కరోనా కారణంగా నిషేధించడం అయితే తినే భోజనం , వేసుకొనే బట్టలు మానేయ లేదు కదా ..నిత్యజీవితంలో అవి అన్నీ జాగ్రత్తలు తీసుకొని జీవన విధానం కొనసాగిస్తున్నామో అదే ఆంక్షలతో కొనసాగించ వచ్చు ..
మన దేశంలో క్రమశిక్షణను అడ్డుపెట్టుకుని శిక్షించడం… లేక దోచుకోవడం రెండూ అధికారులకి, అలవాటే కదా . ఈనాటి నాయకుల విషయం చెప్పనవసరం లేదు జీవితం లో కొంత సమయం సగటుమనిషి, సంస్కృతి , ఆనవాయితీ ల గురించి గూడా ఆలోచించాలి ఆ ఆలోచనే ఈనాటి మన మూర్ఖ నేతలకి కొరవడుతున్నది.

– భరత్

Leave a Reply