Suryaa.co.in

National

బడ్జెట్ రూప కల్పనలో 9 ప్రధానాంశాలు

నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

  •  ఉపాధి కల్పన
  •  నైపుణ్య శిక్షణ
  •  ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
  •  వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు
  •  వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు
  •  కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం
  •  స్వయం సమృద్ధి సాధించడం
  •  రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అభివృద్ధికి ప్రోత్సాహం
  •  ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు

దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం

  1. ఆంధ్రప్రదేశ్‌, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
  2. స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  3. ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు
  4. ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ
  5. గ్రామీణాభివృద్ధికి రూ. 2.66 లక్షల కోట్లు
  6. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి
  7. రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
  8. రూ. 26 వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
  9. అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌ లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం
  10. విద్యార్థులకు రూ. 10 లక్షల వరకూ లోన్, కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు
  • కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు
  • రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం
  • రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం
  • రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం
  • రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం
  • రూ. 15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను

LEAVE A RESPONSE