Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం తగ్గించాలి

-అందుకే చంద్రబాబు 2వేల నోటు రద్దు చేయాలన్నారు
-డిజిటల్ ఎకానమీ ప్రోత్సాహంపై బాబు కేంద్రానికి సూచనలు చేశారు
-మహానాడు వేదిక పై రాజకీయతీర్మానాన్ని బలపరిచిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

“ యనమలరామకృష్ణుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణంగా మధ్దతు ఇస్తున్నాను. రాజకీయాల్లో తెలుగుదేశంపార్టీ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్ గానే నిలిచింది. ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, తొలిసారి పెన్షన్ అందించారు. సంక్షేమంతోపాటు, విద్య, వైద్యం, ఉద్యోగాలు అందించారు. యూనివర్శిటీలు స్థాపించారు.

చంద్రబాబునాయుడు ఆత్మవిశ్వాసం నినాదంతో ముందుకెళ్లారు. హైదరాబాద్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన నిర్మించిన నగరంలోని 26 కట్టడాలను సెల్ఫీలు తీసి, వాటి వివరాలను ప్రజలముందు ఉంచాము. వాటివల్లే తెలంగాణ సంపదపెరిగింది.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్ సిటీ కట్టారు. అప్పుడు ప్రధానివాజ్ పేయ్, అమెరికా అధ్యక్షుడు క్లింటన్ వచ్చారు. అప్పుడు ఆప్రాంతాన్ని చూసి రాళ్లురప్పలు అన్నారు. ఇప్పుడు అదేప్రాంతం సంపదసృష్టి కేంద్రగా మారింది.

ఈ తీర్మానం ద్వారా మనపార్టీ విధానం స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. రాజకీయాలు డబ్బుమయం అయ్యాయి. దాని ప్రాభవాన్ని రాజకీయాల్లో తగ్గించడానికే చంద్రబాబు 2వేల నోటు రద్దు చేయాలన్నారు. డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వేల నోట్లు ప్రజలవద్ద లేవు. ఆ నోట్లన్నీ వైసీపీ నేతల వద్ద ఉన్నాయి. రాష్ట్రానికి సంపద సృష్టించడం, దాన్నిపేదలకు పంచడం మననాయకుడికే తెలుసు.

పీ-4 విధానం ఆచరణసాధ్యమేనా అని చాలామంది సందేహిస్తున్నారు. అసాధ్యాన్నిసుసాధ్యం చేయడమే చంద్రబాబు లక్ష్యం. దేశవ్యాప్తంగా ప్రధాననగరాలను కలుపుతూ వాజ్ పేయ్ ప్రభుత్వం నిర్మించిన రహదారులన్నీ చంద్రబాబు సూచనలఫలితమే.

మొబైల్ టెలిఫోన్ ని తాము విచిత్రంగా చూశాము. నేడు ప్రతి ఒక్కరిచేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. అవిప్రజలకు చేరేలా టెలికమ్ నిబంధనలు సవరించేలాచేసి, ఆనాడున్న కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించింది మన చంద్రబాబు.

మన నాయకుడుచెబుతున్న పీ-4 విధానంతో పేదలు ధనవంతులు అవుతారు. ప్రపంచంలోని అత్యంతధనవంతుల జాబితా టాప్ -10లో మనభారతీయులే 5గురు. అలానే మనదేశంలోనే పేదలు ఎక్కువ. భారతదేశం అభివృద్ధిచెందిన దేశాల జాబితాలో చేరడానికి ఎంతోసమయం పట్టదు.

యనమల ప్రవేశపెట్టిన రాజకీయతీర్మానాన్ని జాతీయభావాలున్న ప్రాంతీయపార్టీ తరుపున బలపరుస్తున్నాను. దేశంలో మొట్టమొదటిసారి రైతురుణమాఫీ చేసింది స్వర్గీయ ఎన్టీఆర్ గారే. మనపార్టీ, మననాయకులు నేడు ఆలోచిస్తే, భారతదేశం రేపు ఆలోచిస్తుంది. ఎన్టీఆర్ ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కల్పిస్తే, 30ఏళ్ల తర్వాత భారతపార్లమెంట్ దానిపై చట్టంచేసింది.

దూరదృష్టి, సమర్థత ఉన్న మననాయకుడి ఆలోచనావిధానం భావితరాలకు బంగారుగని. రాజకీయాల్లో డబ్బుప్రాధాన్యం తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ దిశగా యువత ఆలోచించి, తెలుగుదేశంపార్టీకి, చంద్రబాబు కి మద్ధతుఇవ్వాలి.”

LEAVE A RESPONSE