మైదుకూరు బహిరంగ సభలో నారా లోకేష్…
మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది.
ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు.
పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు.
కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు.
ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాతిక నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం…మనగళం…ప్రజాబలం.
యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి భయపడింది.
కడప గడ్డపై యువగళం ప్రభంజనం చూసి ప్యాలస్ పిల్లికి నిద్ర పట్టడం లేదు.
వైసిపి పార్టీ గుర్తు మారింది. ఫ్యాన్ కాదు కోడి గుడ్డు.
నా పై ప్యాలస్ పిల్లి కోడిగుడ్లు వేయించాడు.
క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది, నీ తొక్కలో కోడి గుడ్డుకు భయపడతామా?
కోడి గుడ్డు వేసిన సైకో గాళ్ళకి మన వాళ్లు మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు.
సైకోస్ చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తాం.
ప్యాలస్ పిల్లికి దమ్ము, ధైర్యం ఉంటే పరదాలు లేకుండా నాలా ప్రజల్లో తిరగాలి.
పరదాలు లేకపోతే ప్యాలస్ పిల్లికి పులుసు కారిపోవడం ఖాయం.
ఒక్క రోజు పరదాలు లేకుండా వెళితే ప్యాలస్ పిల్లిపై ఏం పడతాయో గెస్ చెయ్యండి.
కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త , చెదారం అన్నీ ప్యాలస్ పిల్లిపై పడతాయి. అందుకే పరదాల మద్య పర్యటించి పారిపోతాడు.
ధైర్యంగా ఒక్క రోజు జనాల్లో తిరగలేని బ్రతుకు ప్యాలస్ పిల్లిది.
నేను మరో సారి చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర. ప్రొద్దుటూరు లో చూసింది ట్రైలర్ మాత్రమే నేను చిటికేస్తే గుడ్డు విసిరిన వాడు కనిపించే వాడు కాదు.
నాకు మా నాన్న అంత ఓపిక అసలు లేదు. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దబిడి దిబిడే…
ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అన్నావ్, ఇస్తే పీకింది ఏంటి?
రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడు.
12 లక్షల కోట్ల అప్పు చేసాడు. పుట్టే ప్రతి బిడ్డ మీద అప్పు ఎంతో తెలుసా రూ.2 లక్షలు.
జగన్ అప్పుల అప్పారావు …చంద్రన్న సంపద సృష్టికర్త.
జగన్ ది కక్ష సాధింపు…చంద్రన్నది రాజనీతి.
వైసిపి అంటే కోడికత్తి, కోడి గుడ్డు…టిడిపి అంటే తెలుగు వారి ఆత్మగౌరవం.
వైసిపి ది దున్నపోతు ప్రభుత్వం…టిడిపి ది సంక్షేమ ప్రభుత్వం.
జగన్ పాము కంటే ప్రమాదం…పాము తన పిల్లల్ని తానే తింటుంది.
జగన్ కూడా పాము లాగే సొంత కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని కూడా మింగేస్తున్నాడు.
సొంత బాబాయ్ వివేకాని అత్యంత కిరాతకంగా జగన్, అవినాష్ కలిసి చంపేసారు.
ఏకంగా సొంత చెల్లే రహస్య సాక్షిగా మారింది.
ఇప్పుడు ఆ కేసు నుండి బయటపడటానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి ఇచ్చాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకి బాబాయ్ మర్డర్ కేసు వీక్ అయ్యింది.
పోయిన ఎన్నికల్లో సాయం చేసిన కేసీఆర్ గారికి టోపీ పెట్టాడు జగన్.
అవినాష్ రెడ్డి, భారతి రెడ్డిని కాపాడటానికి కవిత గారిని బలి ఇస్తున్నాడు అనేది ఢిల్లీ టాక్.
ఆఖరికి బాబాయ్ మర్డర్ ని కూడా క్విడ్ ప్రో కో కి వాడుకున్నాడు జగన్.
నిన్న హడావిడిగా మన వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ స్పెషల్ స్టేటస్ వచ్చింది అన్నారు?
జగన్ ఢిల్లీ వెళ్ళింది బాబాయ్ మర్డర్ కేసు లో అరెస్ట్ చెయ్యొద్దు అని కాళ్లు పట్టుకోవడానికి కదా. ప్రత్యేకహోదా ఎప్పుడు వచ్చింది అని అడిగా.
ఆ ప్రత్యేకహోదా కాదు సార్ వివేకా మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్. భాస్కర్ రెడ్డి ని ప్రత్యేకహోదా వచ్చింది సార్ అన్నారు. చంచల్ గూడా జైల్లో భాస్కర్ రెడ్డి స్పెషల్ స్టేటస్ ఖైదీ అంట. జగన్ కి అసలు రాయలసీమ పౌరుషమే లేదు స్పెషల్ స్టేటస్ ఎలా వస్తుంది?
నువ్వు ఎన్ని స్కెచ్ లు వేసినా నిజం ఆగదు జగన్.
కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా… హూ కిల్డ్ బాబాయ్…హూ కిల్డ్ బాబాయ్?
జగన్ అండ్ అవినాష్ కిల్డ్ బాబాయ్. నీ సొంత జిల్లా ప్రజలు చెబుతున్నారు అది జగనాసుర రక్త చరిత్ర అని.
జగన్ పదే పదే కడప బిడ్డని అంటాడు. పులివెందుల బస్ స్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టింది. జిల్లాకి నువ్వు చేసింది ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ముందా? సత్తా ఉందా?
కడప కి ఏం చేసామో చెప్పే దమ్ము నాకుంది. ఏ సెంటర్ కి వస్తావో రా, కడపకు నువ్వు ఎం చేసావో మేము ఏం చేసామో చర్చించుకుందాం.
నువ్వు కడప బిడ్డవి కాదు కడప కి పట్టిన శని.
కడప జిల్లాకి నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నావా?
ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే సినిమా అన్నావ్. నువ్వు కొబ్బరి కాయలు కొట్టి నాలుగేళ్లు అవుతుంది, నువ్వు పీకింది ఏంటి?
కడప జిల్లాకి జగన్ చేసింది ఘరానా మోసం.
కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్?
టిడిపి హయాంలో కడప జిల్లాల్లో ప్రాజెక్టులు కడితే…జగన్ హయాంలో ప్రాజెక్టులు పడగొట్టాడు.
సొంత జిల్లా కి ఉపయోగపడని చెత్త సీఎం జగన్.
నేను వచ్చి నిలదీసిన తరువాత దున్నపోతు ప్రభుత్వం నిద్రలేచింది. నిన్న హడావిడి గా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం అంటూ అధికారులు హడావిడి మొదలుపెట్టారు. అది యువగళం పవర్.
నాలుగేళ్లు పసుపు రైతుల వద్ద పసుపు కొనలేదు. ఇప్పుడు నేను జిల్లాలో తిరుగుతున్నాను అని హడావిడిగా పసుపు కొంటాం అంటూ బయలుదేరారు. అది యువగళం దెబ్బ.
జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు.
ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం.
మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు.
లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు.
బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.
సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడు.
ఒకప్పుడు కేరళ ని పాలించిన కొంతమంది రాజులు రొమ్ము పన్ను వేసారు. జగన్ అంతకంటే దుర్మార్గమైన పాలకుడు.
రొమ్ము పన్ను పేరు ముళకరం…జగన్ పన్ను పేరు జే ట్యాక్స్.
రొమ్ముపై పన్ను వేసింది మార్తాండ వర్మ అయితే చెత్త పై కూడా పన్నేసిన సైకో జగన్.
పేదల ఏడుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయి, అందుకే విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది. త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
ప్రతి దానిపై తన బొమ్మ వేసుకునే జగన్ కరెంట్ బిల్లు మీద, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా బొమ్మ ఎందుకు వేసుకోవడం లేదు?
రాజు మార్తాండ వర్మ పై పోరాడిన మహిళ పేరు నంగేలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మహిళా వీర మహిళ నంగేలిని ఆదర్శంగా తీసుకోని జగన్ ప్రభుత్వం పై పోరాడాలి, అప్పుడే జే ట్యాక్స్ తగ్గుతుంది.
జగన్ ది రాక్షస మనస్తత్వం. ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు.
జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
అన్న క్యాంటిన్ రద్దు, పండుగ కానుక రద్దు, పెళ్లి కానుక రద్దు, చంద్రన్న భీమా రద్దు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, 6 లక్షల పెన్షన్లు రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన సిఎం జగన్.
భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రన్న మహానాడులో మ్యానిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లి ప్యాలస్ లో భూకంపం వచ్చింది. ప్యాలస్ పిల్లి జడుసుకుంది.
యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాకే మినీ మ్యానిఫెస్టో ప్రకటించాం.
కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను.
నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల పెంపు తో బ్రతుకు భారం గా మారిన మహిళల కష్టాలు నేను చూసాను. నా అక్క, చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది.
రాష్ట్రంలో ప్రజల కష్టాలు చూశాకే చంద్రన్న మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించారు.
మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే..మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు.
ఉద్యోగాలు ఇస్తానని యువతను చీట్ చేసాడు జగన్.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దిక్కుమాలిన పరిస్థితి జగన్ పాలనలో ఉంది. నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు.
రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.
ఉద్యోగస్తులు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. ఒకటో తారీఖున జీతం, మీ బకాయిలు తీర్చేది టిడిపి ప్రభుత్వమే.
టిడిపి హయాంలో ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం తో చర్చలు జరిపేవారు. ఇప్పుడు ఏకంగా జగన్ ఉద్యోగ సంఘాల నేతల్నే అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నాడు
బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని కిరాతకంగా చంపారు.
దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా… ఇలా ఎంతో మంది బాధితులు.
మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు.
ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా? నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.
మైదుకూరు లో మ్యాజిక్ చేస్తారని రఘురామిరెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించారు.
మైదుకూరు ఏమైనా మారిందా? ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. ఒక్క అభివృద్ది కార్యక్రమం జరగలేదు.
ఆయన మైదుకూరు ని భూకబ్జాలు, కమిషన్లు, ఇసుక దందా కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు.
ఆయన బాధితులు కోర్టులో కేసులు వేసారు. కొంత మంది పాదయాత్రలు కూడా చేసారు.
దువ్వూరు మండలం చింతకుంటలో సర్వే నెంబర్ 1396-2 లో 80 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి లేపేశారు. బాధితులు పాదయాత్రకు చేస్తుంటే నాయ్యం చేస్తామని నమ్మించి పాదయాత్ర ఆపేసారు పోలీసులు. ఈ రోజు వరకూ వారికి న్యాయం జరగలేదు.
దువ్వూరు మండలం ఎర్రబెల్లి కి చెందిన అక్బర్ బాషాకి చెందిన భూమిని దొంగ పాత్రలతో సృష్టించి ఆక్రమించేశారు. ఈయన సేల్పి వీడియోతో ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డారు.నేటికి న్యాయం జరగలేదు.
దువ్వూరు మండలం ఎర్రబల్లె కు చెందిన పాశం లక్ష్మీ నరసింహకు చెందిన సర్వే 612 లో రెండు ఎకరాల విస్తీర్ణాన్ని ఎమ్మెల్యే బామ్మర్ది నారాయణరెడ్డి పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారు. బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా ఇప్పటి వరకూ ఆ భూమి బాధితుడికి ఇవ్వలేదు.
కాజీపేట మండలంలో భీమటం, మైదుకూరు, చాపాడు మండలంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భూములు కొట్టేయడానికి స్కెచ్ వేసారు ఎమ్మెల్యే.
రాజోలి ఆనకట్ట ఎత్తిపోతల పథకం తదితర పనులకు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు దండుకున్నారు .
సిసి రోడ్లు, డ్రైనేజ్ ఇలా ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలి అన్నా కప్పం కట్టాల్సిందే. ఆఖరికి బిల్లులు ఆపి మరీ కమిషన్ వసూలు చేస్తారు .
ఆఖరికి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆక్రమించుకున్నారు ఎమ్మెల్యే. నంద్యాల పేట గ్రామంలో సర్వే నెంబరు 506బి లో 104 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించి ఇనుప కంచె వేసారు. కోర్టు ఆర్డర్ ప్రకారం 6 నెలల లోపు భూమిని హ్యాండోవర్ చేసుకోమని చెప్పినా అధికారులు హ్యాండోవర్ చేసుకొలేదు.
చాపాడు మండలం వెదురూరులో 12 ఎకరాల్లో ఇసుక తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. కానీ వైసిపి నేతలు వందల ఎకరాల్లో ఇసుక తవ్వేసారు. అక్రమార్కుల పై చర్యలు తీసుకొని, రికవరీ చెయ్యమని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ రోజు వరకూ యాక్షన్ నిల్లు.
కుందు నదిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి ఇసుక దోపిడీ చేస్తున్నారు.
పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని మున్సిపాలిటీలో ఎన్నికల్లో 12 వార్డులు గెలుచుకున్న టిడిపి కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి అధికారం దక్కించుకున్నారు. అంతేకాక పోరాడిన పుట్టా. సుధాకర్ యాదవ్ గారిపై అక్రమ కేసులు పెట్టారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం.
పాదయాత్ర లో భాగంగా మైదుకూరుకి అనేక హామీలు ఇచ్చాడు జగన్.
పోతిరెడ్డిపొడు హెడ్ రెగ్యులేటర్, తెలుగు గంగ కాలువ, కె.సి.కెనాల్, నిప్పులవాగు కాలువల సామర్థ్యాన్నిపెంచుతా అన్నాడు.
పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తా అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.
టిడిపి హయాంలో మైదుకూరు కి మహర్దశ పట్టింది.
సాగు,తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజ్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టిడిపి.
నియోజకవర్గం లో కాలేజీలు, కమ్యూనిటీ భవనాలు కట్టింది టిడిపి.
కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపిని భారీ మెజారిటీ తో గెలిపించండి.
మైదుకూరు లో పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తాం.
పసుపు, కెపి ఉల్లి, వరి, పత్తి రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను.
మైదుకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చెయ్యడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం .
నియోజకవర్గంలో పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మిస్తాం.
మైదుకూరు కి అభివృద్ధి ని పరిచయం చేస్తాం.
టిడిపి నాయకులు, కార్యకర్తల పై కేసులు పెట్టి వేధించిన వారిని విడిచిపెట్టను, మైదుకూరు లో ఉన్నా మలేషియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.
కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది.