• మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది.
• వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీరు సరిగా రావడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక కేసీ కెనాల్ మరమ్మతులు చేయించాలి.
• పొలం వెళ్లేందుకు నాగాయపల్లె నుండి నెర్రవాడ కు సరైన రోడ్డు మార్గం లేదు.
• వైసీపీ నాయకులను ఎన్నిసార్లు అడిగినా రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు.
• సోమాపురం నుండి ఎస్సీకాలనీకి సరైన రోడ్డు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు.
• గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నాం.
• మొర్రాయపల్లె గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా కాల్వలు, సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణను గాలికొదిలేశారు.
• ముఖ్యమంత్రి జగన్ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 నిండు ప్రాణాలు బలయ్యాయి.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కెసి కెనాల్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం.
• గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• మొర్రాయపల్లెలో శ్మశానవాటిక ఏర్పాటుచేస్తాం.