Suryaa.co.in

Andhra Pradesh

ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక అక్రమాలు

-దొంగ వేబిల్లులతో ఇసుక తోలుతూ సీనరేజీ ఆదాయానికి గండి
-జెపి వెంచర్స్ పేరుతో రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వుతున్నారు
-జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులు బినామీ పేర్లతో రూ.50 కోట్లు దోచుకుంటున్నారు
-యువనేత లోకేష్‌ ను కలిసిన తపెట్ల గ్రామస్తులు
-అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం
-అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు, వారికి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందజేయలేదు.
-టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తపెట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు గ్రామస్తులు ఏం ఫిర్యాదు చేశారంటే..
• ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక అక్రమాలు పెరిగిపోయాయి.
• జిల్లాలో 11 క్వారీలకు అనుమతులుంటే, రెట్టింపు క్వారీల్లో అనధికారికంగా ఇసుక తవ్వుతున్నారు.
• జెపి వెంచర్స్ పేరుతో రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వుతున్నారు.
• భూగర్భజలాలు మరింత ఇంకిపోయేలా లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
• దొంగ వేబిల్లులతో ఇసుక తోలుతూ సీనరేజీ ఆదాయానికి గండికొడుతున్నారు.
• తపెట్ల గ్రామంలోని రోడ్లు ఇసుక రవాణా వాహనాల వల్ల పాడైపోయాయి.
• జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు రూ.50 కోట్లు దోచుకుంటున్నారు.
• జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులు బినామీ పేర్లతో దోచుకుంటున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ ఇసుక తవ్వకందారులపై చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఇసుక మాఫియా ధనదాహం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు, వారికి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందజేయలేదు.జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే బినామీ సంస్థను అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీపర్వానికి తెరలేపారు. గత నాలుగేళ్లుగా ఇసుక ద్వారా జగన్ అండ్ కో రూ.10వేల కోట్లు దోచుకున్నారు.
స్థానిక నదుల నుంచి ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. నదీజలాలను పరిరక్షిస్తూ ఇసుక విధానాన్ని సరళీకరించి స్థానికులకు అందుబాటులోకి తెస్తాం.

LEAVE A RESPONSE