Suryaa.co.in

Telangana

టీడీపీలో మహిళలకు ప్రాధాన్యం

– మహిళలకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీదే
– పదవులు తీసుకున్న వారు పనిచేయండి
– నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటా
– తెలుగుమహిళలతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని

తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ లక్ష్యం కూడా అదేనని స్పష్టం చేశారు. దళిత మహిళను స్పీకర్‌ చేసిన ఘటన టీడీపీదేనని గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్‌ , చంద్రబాబునాయుడు చేసిన సేవలను తెలుగుమహిళలు గ్రామానికి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పదవులు తీసుకున్న వారు వాటిని సద్వినియోగం చేసుకుని, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. తాను 24 గంటలు పార్టీ కార్యకర్తలకు, అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి నాయకత్వంలో తెలుగుమహిళలు కాసానిని కలసి, పార్టీలో తమకు స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు సంధ్యపోగు సుజాత.. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని, తెలుగుమహిళ అధ్యక్షురాలు షకీలారెడ్డిని సన్మానించారు.

LEAVE A RESPONSE