-21 వ తేదీ నుంచి ఎలక్షన్ కమిషన్ తలపెట్టిన ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటూ పిలుపు
-ఓటు మన బాధ్యత… ఓటుతో భద్రత….ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా!
జూలై 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగనుంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ సందర్భంగా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి.