– పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీస్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీస్ ను పోలీస్ విధులకు వినియోగించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగింది.