Suryaa.co.in

Andhra Pradesh

అర్థనగ్న ప్రదర్శనలు, మహిళల ప్రత్యేక పూజలు, దివ్యాంగుల మానవహారాలు

– రాష్ట్రవ్యాప్తంగా 11వ రోజు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు

చంద్రబాబునాయుడిపై ప్రభుత్వం సాగిస్తున్న కుట్ర రాజకీయాలను నిరసిస్తూ, శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి భారీస్థాయిలో నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకు జనసేన, సీపీఐ, సీపీఎం, జైభీమ్ భారత్ పార్టీలు కూడా మద్ధతు తెలిపి, నిరసనల్లో పాల్గొన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి మద్ధతుగా విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీఎన్‍టీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేప్టటారు. దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పల్లా శ్రీనివాసరావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, తప్పుడు కేసుల్లో చంద్రబాబుని జైలు కు పంపడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండోరోజూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది. దీక్షలో పాల్గొన్న ఆయనకు టీడీపీనేతలు, ఇతరపార్టీలవారు సంఘీభావం తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులు చేపట్టిన వినూత్న నిరసనలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన 300 మంది పోలీసులు అఖిలప్రియను బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఆమె ప్రతిఘటించారు. దాంతో ఆమెను ఆళ్ల గడ్డ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఆమె ఇంటిలోనే ఆమరణ దీక్ష చేపట్టారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రకాశ్ నగర్లో భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన భిక్షాటన కార్యక్రమంలో టీ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టీ.ఎన్.టీ.యూ.సీ కోశాధికారి సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి చంద్రబాబు గారిని అన్యాయంగా జైలుకు పంపడాన్ని నిరసిస్తూ 12 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ స్థానిక శివాలయం.. మరిడమ్మ ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేపట్టారు.

అనకాపల్లిలో చంద్రబాబు నాయుడికి మద్ధతుగా కదంతొక్కిన దివ్యాంగులు
2 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి, బాబుతో మేముసైతం అని సంతకాలు సేకరించిన దివ్యాంగులు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సైకో పోవాలి – సైకిల్ రావాలని అనకాపల్లి పట్టణంలో నినాదాలతో దివ్యాంగులు హోరెత్తించారు. సైకో పాలన పోవాలంటూ స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ లో దివ్యాంగులు చేపట్టిన మానవహారం పట్టణ వాసుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దివ్యాంగులు చంద్రబాబుకు మద్ధతుగా తమ అభిప్రాయాలు రాసిన పోస్ట్ కార్డుల్ని రాజమహేంద్రవరం జైలుకు పంపారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, కొల్లు రవీంద్ర, వంగళపూడి అనిత పార్లమెంట్ అధ్యక్షులు కూన రవి, కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగధీశ్వరరావు, జ్యోతుల నవీన్, గన్ని వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ, మల్లెల రాజశేఖర్ గౌడ్, బికె పార్థసారథి, పులివర్తి నాని, మాజీ మంత్రులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనకాపల్లిలో చంద్రబాబు నాయుడికి మద్ధతుగా కదంతొక్కిన దివ్యాంగులు
2 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి, బాబుతో మేముసైతం అని సంతకాలు సేకరించిన దివ్యాంగులు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సైకో పోవాలి – సైకిల్ రావాలని అనకాపల్లి పట్టణంలో నినాదాలతో దివ్యాంగులు హోరెత్తించారు. సైకో పాలన పోవాలంటూ స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ లో దివ్యాంగులు చేపట్టిన మానవహారం పట్టణ వాసుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దివ్యాంగులు చంద్రబాబుకు మద్ధతుగా తమ అభిప్రాయాలు రాసిన పోస్ట్ కార్డుల్ని రాజమహేంద్రవరం జైలుకు పంపారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, కొల్లు రవీంద్ర, వంగళపూడి అనిత పార్లమెంట్ అధ్యక్షులు కూన రవి, కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగధీశ్వరరావు, జ్యోతుల నవీన్, గన్ని వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ, మల్లెల రాజశేఖర్ గౌడ్, బికె పార్థసారథి, పులివర్తి నాని, మాజీ మంత్రులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

LEAVE A RESPONSE