Suryaa.co.in

National

ఏ సేవకైనా 112 కు డయల్ చేస్తే చాలు

ఇప్పటివరకు ఒక్కో సమస్యకు సంబంధించి ఒక్కో నంబరుకు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఆ నంబర్ బిజీగా ఉంటే సమస్య అవతలి వారికి తెలిసేది కాదు. వెంటనే ఆ నంబరు గుర్తుకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేవలన్నింటినీ ఒకే నంబరు 112 కిందకు తీసుకొచ్చింది. ఇకపై ఏ సేవ కావాలన్నా ఆ నంబరుకు ఫోన్ చేస్తే సంబంధిత విభాగానికి కాల్ బదిలీ చేస్తారు. ఏదైనా అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం కోసం 100, అగ్నిమాపక సేవలకు 101, వైద్య సేవలకు 108, చిన్నారుల రక్షణకు 1098 నంబర్లకు ఫోన్ చేయాలని అందరికీ తెలిసిందే.

LEAVE A RESPONSE