Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ విగ్రహం పేరుతో వందల కోట్ల కుంభకోణం

– హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఖర్చు 150 కోట్లు
-బెజవాడలో 400 కోట్లు ఖర్చు ఎలా అవుతుంది?
– టిడిపి దళిత నేతల ఆరోపణ

తుళ్లూరు మండలం శాఖమూరు లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాంతాన్నిపరిశీలించిన
మాజీ మంత్రి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు,తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులువర్లరామయ్య,తిరువూరు నియోజకవర్గం ఇంచార్జి సేవల దేవాదత్తు, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిరాల మ్యాని, పిల్లిమాణిక్యారావు, దేవతోటి నాగరాజు, సుశీల రావు, కోడూరి అఖిల్,మైనర్ బాబు, బత్తుల హరిదాసు,పులి చిన్నా,కారంగి అనిల్, సౌపాటి రత్నం, ఆదాము,బలరాం, మాణిక్యం,తెలుగుదేశం నాయకులు,దళిత నేతలు ఉన్నారు.

దొంగలించబడిన విగ్రహాలు, స్మృతి వనం ప్రాజెక్టు నిర్వీర్యం ప్రాంతాలను పరిశీలించిన నేతలు

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ… అంబేద్కర్ పేరు అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైకాపా ప్రభుత్వం తెరలేపింది. హైదరాబాద్ లో రూ.150 కోట్ల తో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే, అలాంటి ఉగ్రహానికే ఏపీలో రూ.400కోట్లు ఖర్చు చూపటం దోపిడీ కాక మరేంటి? తెలుగుదేశం ప్రభుత్వం రూ.137కోట్ల తో 125అడుగుల ఎత్తు విగ్రహంతో నిర్మించ తలపెట్టిన స్మృతి వనాన్ని నాశనం చేశారు. రూ. 36కొట్లతో 26శాతం పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు కంటే చిన్నది వైకాపా ప్రభుత్వం చేపట్టి రూ.400కోట్ల ఖర్చు చూపెట్టడమేoటి?

ప్రభుత్వ కనుసన్నుల్లోనే అంబేద్కర్ విగ్రహాలు దోపిడీకి గురయ్యాయి
ఆనాడు అంబేద్కర్ గారి స్మృతి వనం కోసం 36 కోట్లు ఖర్చు పెట్టాము. 26 శాతం పనులు పూర్తయ్యాయి. ఫౌండేషన్ పనులు మొత్తం అయిపోయింది. దానికి సంబంధించి అంబేద్కర్ గారి నమూనా విగ్రహాలు 7 విగ్రహాలు పెట్టడం జరిగింది. అందులో ఆరు విగ్రహాలు దొంగిలించుకుపోయారు. ఒక విగ్రహం మాత్రమే మిగిలింది. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతున్నారని చాలా గొప్పగా చెబుతున్నారు.

ఆనాడు అంబేద్కర్ గారి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని స్లాగిస్తూ ప్రతి ఒక్కరు కొనియాడారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటికి వెళ్లిపోయాడు.

ఆరోజు తీసుకునే నిర్ణయం రాజధానులు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని, ఇండోర్ ఔట్డోర్ బుద్ధిష్ణకేంద్రం పదివేల పుస్తకాలతో ఒక లైబ్రరీ అదేవిధంగా మ్యూజియం ఏర్పాటు చేయాలని 20 ఎకరాలు చంద్రబాబునాయుడు కేటాయించారు.

ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి ని ఏ విధంగా నిర్ధాక్షణంగా చంపేశాడు అదేవిధంగా అంబేద్కర్ గారి స్మృతి వనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్న అనేసి అన్నాడు.

ఆరోజు ఈ ప్రాజెక్టు విలువ 137 కోట్లు, ఇదే 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో కెసిఆర్ గారు 150 కోట్లతో కట్టారు
ఈరోజు విజయవాడలో కడుతున్న అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహం ఖర్చు 404 కోట్లు అంట!

అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద వందల కోట్లు దోచుకోవడానికి ఇది ఏర్పాటు చేశారు ఈరోజు అంబేద్కర్ గారి మీద అతనికి ఎంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అంబేద్కర్ గారి విదేశీ విద్య పేర్లు జగన్ విదేశీ విద్యానిధిగా పేరు మార్చాడు ఇంతకంటే సిగమాల చర్య ఏదైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ప్రతిరోజు కూని చేస్తున్నారు

నిన్న విజయవాడలో విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ గారి విగ్రహ ఓపెనింగ్ గురించి చెబుతున్నారు. ఇది మొత్తం చేసేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి విజయసాయి రెడ్డి పక్కన నుంచొని ఉంటే ఈ పెత్తందారడైన విజయసాయిరెడ్డి ప్రెస్ కి చెబుతున్నాడు.

దళితుల ఓట్లతో గద్దెరెక్కల జగన్ రెడ్డి దళితులను గోరాతి ఘోరంగా అవమానించారు హత్యలు చేశారు మానభంగాలు చేశారు మూత్ర విసర్జన చేశారు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి పెట్టి పాపాలన్నీ కడిగేసుకుందామని అనుకుంటున్నారా సిగ్గుండాలి

చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో రాజధాని నడిబొడ్డున అంబేద్కర్ గారి స్మృతి వనం బాబు జగజీవన్ రామ్ గారి సమతా స్మృతి వనంకు 10 ఎకరాలు 50 కోట్లు కేటాయించారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలవుతున్న పథకాలు రద్దుచేసి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలు రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు చేస్తున్న పనులన్నీ దళితులు గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.

వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు ఏమన్నారంటే..
అమరావతి ని చంపేసింట్లే అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్మోహన్ రెడ్డి చంపేశారు. గత 5ఏళ్లలో దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఎప్పటికీ పోవు. అంబేద్కర్, ఆయన రాసిన రాజ్యాంగం పైనా ఏ మాత్రం చిత్తశుద్ధి, గౌరవం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే

LEAVE A RESPONSE