Suryaa.co.in

Andhra Pradesh

ఆముదాలవలసలో ముగ్గురు దొంగలు హుండీలు పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు

-ముగ్గురు సూపర్ ఎమ్మెల్యేల కలెక్షన్ల పర్వం
-సీతారాం స్పీకర్ గా ఉండి చేసింది శూన్యం
-కూన రవి పులిలా పోరాడుతున్నారు
-మళ్లీ రవిని గెలిపించుకోవడం ప్రజలకు అవసరం
– ఆముదాలవలస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు

ఆముదాలవలసలో కూనరవికుమార్ పులిలా పోరాడుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు, నియోజకవర్గంలో పసుపు తప్ప మరో జెండా కనపడే పరిస్థితి లేదు. తమ్మినేని సీతారాంను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారు.

ఎన్నోరకాల ఇబ్బందులు పడుతూ శంఖారావంతో లోకేష్ మన ముందుకు వచ్చారు. మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయినా అక్కడే అఖండ మెజారిటీతో గెలవాలన్న పట్టుదలతో కష్టపడి పనిచేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకు కార్యకర్తలు విశ్రమించొద్దు. 2014-19 నడుమ ఆముదాలవలస అందాలవలసగా వెలిగింది, కోట్లాదిరూపాయలతో అభివృద్ధి చేశారు.

కూనరవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు బస్ కాంప్లెక్స్, టిడ్కో ఇళ్లు, రహదారులు ఎన్నోవచ్చాయి. ఇసుకదందా, దోపిడీకోసమే పదవులను ఉపయోగించుకున్నారు, స్టేడియం గతంలో తెస్తే వీరు వచ్చాక కూల్చేశారు.

శ్రీకాకుళం- ఆముదాలస రోడ్డు అధ్వాన్నంగా తయారుచేశారు, మంత్రి, స్పీకర్ గా ఉన్న వ్యక్తులు రోడ్డు వేసుకోలేకపోయారు, వారికి ఆ పదవుల్లో కొనసాగే అర్హత ఉందా? వంశధార, నాగావళి నదులు కలిగిన నియోజకవర్గం ఆముదాలవలస, కూనరవికుమార్ ఎన్నో నిధులు తెచ్చి ప్రజలకు నీళ్లిచ్చేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు ఇసుక తప్ప మరేమీ కన్పించడం లేదు, ఇసుక రేటు ఆకాశాన్నంటుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. దౌర్జన్యంతోనే అయిదేళ్లు గడిపారు, ఇక ఎవరికీ భయపడే పరిస్థితి లేదు.

జాలిపడి ఓట్లు వేస్తే చంద్రబాబును అనరాని మాటలు అన్నారు, ఆయనను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది. ఆముదాలవలసకు ప్రస్తుతం సీతారాంతోపాటు ముగ్గురు సూపర్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, ముగ్గరు హుండీలు ఏర్పాటుచేసుకుని కలెక్షన్ వసూలు చేస్తున్నారు.

తాడేపల్లిలో పెద్దదొంగ కూర్చున్నాడు, మూడురాజధానులు అంటున్నాడు, అందుకే తుగ్లక్ సిఎం అంటున్నాం. ఎదుటివాడు ఎంతబాధపడితే సైకోకు అంత ఆనందం, జగన్ నిద్రపోవాలంటే ప్రజలు బాధపడాల్సిందే.

రాక్షసపాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్ రెడ్డి, టిడిపి కార్యకర్తలు సైనికుల్లా ముందుకు సాగాలి. 74ఏళ్ల వయసులో చంద్రబాబు పడుతున్న కష్టాన్ని స్పూర్తిగా తీసుకొని పనిచేయాలి. రెండునెలలు స్టేషన్ లో పెట్టినా ప్రజలకోసం వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు.

ప్రజలు, యువతకు భరోసా ఇచ్చేందుకు బాబు ప్రజల్లో తిరుగుతున్నారు, 151 సీట్లు ఇస్తే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు, సాధారణంగా దొంగలు, టెర్రరిస్టులను బురఖాలతో తీసుకెళ్తారు, ప్రజలు సిఎంగా చేస్తే ముఖం చూపించడానికి భయపడుతున్నాడు.

దారిపొడవునా చెట్లు కూడా ఉండకూడదనేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు, ఈ సిఎం ఉంటే రాష్ట్రానికి శనిపట్టినట్లే. రెండునెలల్లో వచ్చే ఎన్నికల్లో సైకిల్ పవర్ ఏంటో ఆముదాలవలస ప్రజలు చూపాలి.

అధికారంలోకి వచ్చాక ఆముదాలవలస రైల్వేస్టేషన్ ను ప్రధాన స్టేషన్ గా తీర్చిదిద్దుతా. కేంద్రపరంగా ఎటువంటి సమస్య ఉన్నా ఎర్రన్నాయుడు స్పూర్తితో వారధిగా పనిచేస్తా.

వంశధార ప్రాజెక్టుకు బొడ్డేపల్లి రాజగోపాలరావు పేరుపెట్టాలని పార్లమెంటులో గళమెత్తాను. జగన్ డిల్లీవచ్చి పార్లమెంటు చుట్టూ తిరగుతుంటే ఆయన వెంటవెళ్లడానికి వైసిపి ఎంపిలే భయపడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలసిపోవడానికి సిద్ధంగా ఉంది, జగన్ సిద్ధం అంటున్నది జైలుకు వెళ్లడానికే. ఏ జైలుకు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది జగనే.

ఎన్నికల్లో ఓడాక జగన్ ఏదో ఒక ప్యాలెస్ కి వెళ్తాడు, ఆముదాలవలసలో పిల్ల సైకోలు కూన రవికుమార్ ను దాటి ఎక్కడికి వెళ్తారు? లోకేష్ రెడ్ బుక్ లో పేర్లున్న వారు తప్పించుకోలేరు. వడ్డీతో సహా చెల్లిస్తారు.

ఉద్యోగాల్లేక మన శ్రీకాకుళం వాసులు వలసలు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితి మారాలంటే మళ్లీ టిడిపి వచ్చాక స్థానికంగానే పరిశ్రమలు ఏర్పాటుచేయాలి. ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నవారు కన్పించకపోయారు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేసి ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేయాలి.

కరోనా వదిలింది కానీ రాష్ట్రానికి జగనోరా వైరస్ వదల్లేదు, టిడిపికి ఓట్లువేసి గెలిపిస్తేనే ఈ వైరస్ కు విరుగుడు లభిస్తుంది. కూనరవికుమార్ లాంటి నాయకుడు దొరకడం ఆముదాలవలస ప్రజల అదృష్టం, నియోజకవర్గ అభివృద్ధికి మేం ఇద్దరం కలసికట్టుగా పనిచేస్తాం. టిడిపి-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించాలి.

LEAVE A RESPONSE