Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేసే పనులు..చెప్పే మాటలన్నీ ఎన్నికల స్టంట్

• ఎన్నికల్లో పోటీకి వైసీపీ అభ్యర్థుల్ని వెతుక్కునే దుస్థితికి దిగజారిన జగన్ ను ప్రజలు నమ్ముతారా?
• నోటిఫికేషన్ వచ్చేముందు జగన్ చేసే ప్రసంగాలు… చేపడుతున్న కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలి
• అధికారుల సంతకాలు.. ప్రభుత్వ ముద్రలు లేకుండా ఇచ్చే ఇంటిపట్టాలు దేనికి పనికొస్తాయో వైసీపీనేతలు చెప్పాలి
• నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు.. నా మైనారిటీలు అంటూ ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేశాడు
• ఒంగోలుసభలో బాలినేని సహా, వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నేతలందరూ జగన్ రెడ్డితో అంటీముట్టనట్టే ఉన్నారు
• టీడీపీ హయాంలో మచిలీపట్నం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి
• పేర్నినాని, అతని కొడుకు చెప్పే అబద్ధాల్నిమచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు నమ్మేస్థితిలో లేరు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఓటమి భయంతోనే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిననే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడని, ఆయనపై వైసీపీనేతలే నమ్మకం ఉంచడం లేదని, మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులకు బదులు మా నీపై నమ్మకం లేదు జగన్ అని పెడితే బాగుంటుందని, నియోజకవర్గాల్లో తనపార్టీ తరుపున పోటీకి అభ్యర్థుల్ని వెతుక్కునే దుస్థితికి జగన్ దిగజారాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

నోటిఫికేషన్ వచ్చే ముందు ముఖ్యమంత్రి హోదాలోజగన్ రెడ్డి చేసే పనులు.. చేపట్టే కార్యక్రమాలపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి
“ ఎన్నికలకు 6 నెలల ముందు ఏ నాయకుడు,ప్రభుత్వం చేసే పనులైనా కేవలం ఎన్నికల్ స్టంట్ లో భాగమేనని గతంలో చెప్పిన జగన్ రెడ్డి, నేడు ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఎలాంటి చర్యో చెప్పాలి. సెంటు పట్టాల పేరుతో ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామాలకు తగినట్టే, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికారుల సంతకా లు, స్టాంపుల ముద్రలు లేకుండా ఉత్తుత్తి ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతున్నారు. మరో వారం 10రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి చేసేపనులు…చేపట్టే కార్యక్ర మాలపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి.

బైజూస్ నిర్వాహకుడు రవీంద్రన్ పై కేంద్రసంస్థలు చేస్తున్న విచారణపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?
జగన్ రెడ్డి ఆదేశాలతో అడ్డగోలుగా తప్పులు చేస్తున్న అధికారులు అందరూ కచ్చితంగా శిక్షింపబడతారని హెచ్చరిస్తున్నాం. ఏ స్థాయి అధికారి అయినా చేసిన తప్పుకు టీడీపీప్రభుత్వం రాగానే మూల్యం చెల్లించుకుంటాడు. అవసరమై తే కొందరు అధికారుల్ని సర్వీసుల నుంచి తొలగించి, అనర్హులుగా ప్రకటిస్తాం. పాఠ శాలల విలీనం పేరుతో రాష్ట్ర విద్యావ్యవస్థను నాశనంచేసిన జగన్ రెడ్డి, దాతల సహాయసహకారాలతో నడిచే ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసి వాటిని నాశనం చేశాడు.

బైజూస్ కంటెంట్ పాఠశాలల్లో ఏర్పాటుచేశానని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, ఆ సంస్థ నిర్వాహకుడు రవీంద్రన్ పై జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల విచారణపై ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులకు పంపిణీ చేసిన ల్యాప్ ట్యాప్ ల కొనుగోళ్లలోకూడా జగన్ అవినీతికి పాల్పడ్డాడు. ఈ విధంగా ప్రతి అంశంలో, ప్రతి పథకంలో జగన్ రెడ్డి తన అవినీతిని వెతుక్కున్నాడు తప్ప, ఏ వర్గానికి ఎలాంటి మేలు చేయలేదు.

డీబీటీ ద్వారా పేదలకు రూ.2.50లక్షలకోట్లు ఇచ్చానంటున్న జగన్ రెడ్డి, తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు
రూ.10లక్షలకోట్లు అప్పులు చేసిన జగన్ రెడ్డి, డీబీటీద్వారా పేదలకు రూ.2.50 లక్షలు ఇచ్చానని చెబుతూ, తానుచేసిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తు న్నాడు. డీబీటీ విధానం గతంలో చంద్రబాబే అమలుచేశాడు. డైరెక్ట్ గా లభ్దిదారు లకు అందాల్సిన ప్రభుత్వసాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పడేలాచేశారు. మద్యం అమ్మకాల్లో నగదు చెల్లింపులు మాత్రమే అనుమతించిన జగన్ రెడ్డి, అలా వచ్చేసొమ్ముని వచ్చే ఎన్నికల్లో పంచి గెలవాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డి విసిరే తాయిలాలకు ప్రజలు మోసపోయేస్థితిలో లేరు. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తమకు చేసిన ద్రోహం..వంచనను వారు నిత్యం గుర్తుచేసుకుంటున్నారు.

నా ఎస్సీలు…నా ఎస్టీలు..నా బీసీలు..నా మైనారిటీలు అని చెబుతూ జగన్ రెడ్డి ఆయావర్గాలకు చేసిన ద్రోహాన్ని వారు ఎప్పటికీ మర్చిపోరు
నా ఎస్సీలు…నా ఎస్టీలు..నా బీసీలు.. నామైనారిటీలు అని నాలుకతో చెప్ప డమే గానీ, జగన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదు. తాను చేసిన ద్రోహాన్ని వారు ఎప్పటికీ మర్చిపోరు. బలహీనవర్గాలకు సబ్ ప్లాన్ నిధులు లేకుండా చేసిన జగన్ రెడ్డి, ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టి, రూపాయి నిధులివ్వకుండా కార్పొరేషన్ల ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు. ఉత్తరాంధ్రలోబీసీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చి, వారిపై పెత్తనం చేయడానికి వై.వీ.సుబ్బారెడ్డిని నియమించాడు అలానే అన్నిప్రాంతాల్లో తన సామంతుల్ని నియమించి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారి టీ వర్గాల మంత్రులకు విలువలేకుండా చేశాడు.

కేవలం ఓట్లు దండుకోవడానికే ఇప్పుడు జగన్ కొత్తపాటలు (నినాదాలు) పాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ‘జయహో బీసీ’ కార్యక్రమం ద్వారా టీడీపీ ఇప్పటికే బలహీనవర్గాలకు దగ్గరైంది. దాదాపు 900 సమావేశాలు నిర్వహించిన టీడీపీ, త్వరలోనే బలహీనవర్గాల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనుంది. దళితతేజం ద్వారా దళితసోదరులకు జరిగిన అన్యాయం.. జగన్ వారికి చేసిన ద్రోహాన్ని తెలియచేస్తూ కార్యక్రమాలు చేపట్టాం. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు దళిత డిక్లరేషన్ కూడా ప్రకటించ బోతున్నారు. జగన్ రెడ్డి చేసిన మోసాలు.. దోపిడీ..అవినీతిని ప్రజలకు తెలియ చేసి, ఎన్నికలనాటికి ప్రజలు ఈ ముఖ్యమంత్రిని ఛీకొట్టేలా చేస్తాం.

సొంత చెల్లిని తనపార్టీ పేటీఎం బ్యాచ్ తో జగన్ అనరాని మాటలు అనిపిస్తున్నాడు
సొంత బాబాయ్ ను కిరాతకంగా చంపించిన జగన్ రెడ్డికి కుటుంబ విలువలు.. కుటుంసభ్యులపై ప్రేమాభిమానాలు ఉంటాయా? సొంతచెల్లి అని చూడకుండా వేరేపార్టీలో చేరి, తనను ప్రశ్నిస్తోందన్న అక్కసుతో షర్మిలను వైసీపీ సోషల్ మీడియాద్వారా పేటీఎం బ్యాచ్ తో అనరాని మాటలు అనిపిస్తున్నాడు. జగన్ రెడ్డి నైజం గ్రహించిన ప్రజలు అతనికి సరైన విధంగా బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో టీడీపీ-జనసేన నిర్వహించే సభలు, చేపట్టబోయే కార్యక్రమాలు జగన్ రెడ్డిని వణికిస్తాయి. ఆక్రమంలో భాగంగా 28వతేదీన ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించ బోతున్న భారీ బహిరంగసభ జగన్ రెడ్డికి దడపుట్టిస్తుంది.

టీడీపీప్రభుత్వంలో మచిలీపట్నం నియోజకవర్గంలో మేం చేసిన అభివృద్ధి పనులు మా పనితనానికి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అలా చెప్పుకోవడానికి పేర్నినానికీ ఒక్కటైనా ఉందా?
టీడీపీప్రభుత్వంలో పేదలకోసం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వడానికి ఈ ముఖ్య మంత్రికి ఎందుకు మనసురాలేదు. నిజంగా జగన్ రెడ్డి పేదల మనిషే అయితే, వారిని ఆదుకునే వ్యక్తే అయితే గతప్రభుత్వం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వకుండా పాడుపెడతాడా? ఇప్పుడు ఇళ్లపట్టాల పేరుతో జగన్ రెడ్డి ఆడుతున్న డ్రామా లన్నీ ఎన్నికలకోసమే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వేసే వేషాలు ప్రజ లకు తెలియవనుకుంటే ఎలా? పేర్నినాని మచిలీపట్నం నియోజకవర్గంలోని పేదలకు అధికారుల సంతకాలు, ప్రభుత్వ ముద్రలు లేని ఇళ్లపట్టాలు అందిస్తు న్నారు.

జగన్ రెడ్డి మచిలీపట్నం అభివృద్ధికి రూ.50కోట్లు ఇచ్చినట్టు పేర్నినాని, అతని కొడుకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టీడీపీ హాయాంలో మేం పేదల కోసం కట్టించిన 6,400 ఇళ్లు, తాగునీటికోసం నిర్మించిన 8 వాటర్ ట్యాంకులు, మచిలీపట్నం–విజయవాడ హైవే, మచిలీపట్నం బీచ్ లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధిపనులు, బందర్ పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రూ.25 లక్షలు ఇవ్వడం.. సేకరించిన భూములు కళ్లముందు కనిపించడం మా పనితనానికి, పాలనకు సజీవ సాక్ష్యాలు. అలా చెప్పుకోవడానికి పేర్నినానికి ఒక్కటైనా ఉందా? ఆయనతో చర్చకు సిద్ధం.. ఎప్పుడు వస్తాడో…ఎక్కడకు రమ్మంటాడో చెప్పాలి.” అని రవీంద్ర సవాల్ విసిరారు.

LEAVE A RESPONSE