-నాడు బాబాయ్ ని హత్య చేయించి చంద్రబాబుపై నెట్టాడు
-నేడు అవ్వాతాతల్ని చంపి ఆ నెపాన్నీ చంద్రబాబుపై నెట్టాడు
-జగన్ రెడ్డి ఆదేశాలతోనే జోగి రమేష్ శవ రాజకీయాలు చేశాడు
-తక్షణమే జోగి రమేష్ పై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
2019లో సొంత బాబాయిని హత్య చేయించి ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టిన జగన్ రెడ్డి నేడు అవ్వాతాతల్ని చంపి ఆ నెపాన్ని కూడా చంద్రబాబుపైకి నెట్టి శవ రాజకీయం చేస్తున్నాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ రెడ్డికి శవ రాజకీయాలు అలవాటుగా మారింది. కోడ్ అమల్లో ఉన్నా జగన్ రెడ్డి నేర బృందం ఎన్నికల కమీషన్ ఆదేశాలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయ లబ్ధి కోసం పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి ఆ నెపాన్ని టీడీపీపైన నెట్టే కుట్ర చేయడం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ తీసుకున్న నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా?వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేయడం వల్లే ఈసీ వారిని దూరం పెట్టింది వాస్తవం కాదా? 1.35 లక్షలమంది సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛను ఇంటికి పంపేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం.
ఉద్యోగుల ద్వారా 64 లక్షలమందికి పింఛను ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు. ఒక్కో ఉద్యోగి కేవలం గంటా, రెండు గంటల్లో 44 మందికి పెన్షన్ ఇవ్వొచ్చు. కానీ పెన్షన్ పంపిణీలో ఎన్నికల కమీషన్ ఆదేశాలు పట్టించుకోకుండా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఎండలో సచివాలయాలకు తరలించి రాక్షస క్రీడ ఆడుతున్నాడు.
వజ్రమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి ఎండదెబ్బకు చనిపోయింది. జగన్ రెడ్డి ఆదేశాలతో జోగి రమేష్ చనిపోయిన వృద్ధురాలితో రాజకీయం చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు కోర్టుకు వెళ్లడం వల్లే పెన్షన్ రాలేదని జోగి రమేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడటం దుర్మార్గం. దీనిపై ఎలక్షన్ కమీషన్ దృష్టి పెట్టాలి. ఈసీ నిర్ణయాలు మారు మాట్లాడకుండా అమలు చేయాలని జగన్ రెడ్డి, జోగి రమేష్ కు తెలీదా? శవాన్ని చంద్రబాబు ఇంటి ముందు వేద్దామని నీచంగా మాట్లాడిన జోగి రమేష్ కు పెనమలూరు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. జోగి రమేష్ కు ఓటమి అంతిమ యాత్రను పెనమలూరు ప్రజలు సిద్ధం చేశారు.
గతంలోనూ వైసీపీ రౌడీ మూకలతో చంద్రబాబు గారి ఇంటిపైకి జోగి రమేష్ వెళ్లి నానా యాగీ చేశాడు. పల్నాడులోనూ టీడీపీ నేత జీవీ ఆంజనేయులును నోటి కొచ్చినట్టు మాట్లాడిన బోళ్ల బ్రహ్మ నాయుడిపై చర్యలు తీసుకున్నట్టే ఇప్పుడు జోగి రమేష్ పైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కోడ్ అమల్లో ఉన్నా కూడా జగన్ రెడ్డి ఆదేశాలు అమలు చేస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెడితే మరొకరికి ఆ విధులు అప్పగించడం ప్రభుత్వ బాధ్యత కాదా?
ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? జగన్ రెడ్డి అరాచక పాలనలో తల్లి, చెల్లీ అందరూ బాధితులే. మద్యపాన నిషేదం పేరుతో మహిళల మాంగల్యాలు తెంచేశాడు. ఇసుక కుంభకోణాలు చేసి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశాడు. అమరావతి, పోలవరం నిలిపేసి రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేశాడు. ఉద్యోగులను , నిరుద్యోగులను నిండా ముంచాడు. అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఆదాయ పరిమితి నిబంధన పేరుతో సంక్షేమానికి దూరం చేశాడు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ అని పైకి మాట్లాడుతూ ఆచరణలో వారిని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు.
వాలంటీర్లు జగన్ రెడ్డి కుట్రకు బలికావద్దు. పండు ముసలివాళ్లను మండుటెండలో తీసుకొస్తుంటే బాధ కలుగుతోంది. శవ రాజకీయాలు చేస్తూ ,శవాలపై పేలాలు వేలుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్ రెడ్డి పన్నాగాలు రచిస్తున్నాడు. జగన్ రెడ్డి దుర్మార్గ పాలన,కుటిల రాజకీయాలను ప్రజలు అర్ధం చేసుకున్నారు. రూ.200 పెన్షన్ రూ .2000 చేసిన చంద్రబాబుకే ఓటేయాలని ప్రజలు డిసైడయ్యారు. చంద్రబాబు గారు సీఎం కాగానే ప్రతి నెలా ఒకటో తేదీనే ఒకేసారి రూ. 4,000 పెన్షన్ ఇంటి వద్దకే అందిస్తారు.