Suryaa.co.in

Andhra Pradesh

బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం

– ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు

గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు.

మంత్రి విడదల రజని , ఎంటి కృష్ణ బాబు లు స్వయంగా వార్డుల్లోని బాధితులను ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ బాధితులను వారు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారు చెప్పారు. ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవల పై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కృష్ణబాబు సూపరింటెండెంట్ ఛాంబర్ లో డిఎంఈ డాక్టర్ నరసింహం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ లతో కృష్ణబాబు డయేరియా కేసుల గురించి సమీక్ష చేసారు.

అనంతరం కృష్ణబాబు మీడియా తో మాట్లాడుతూ ప్రతి వెయ్యి కుటుంబాలకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల పరిధి లో దాదాపు 23 వేల కుటుంబాలు ఉన్నాయని ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచనలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. వాంతులు , విరోచనాలు వచ్చిన వెంటనే నగర పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించామని ఆయన చెప్పారు. వాంతులు విరోచనాలు ఉన్న వారు వెంటనే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం అందే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.

గత మూడు రోజుల నుంచి 75 కేసులు నమోదయ్యాయని అందులో 15 మందిని డిశ్చార్జి చేశామని అయన చెప్పారు.గడచినా 24 గంటలో 20 మంది బాధితులు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. గడచిన 24 గంటల్లో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.

నగరంలోని మూడు ప్రాంతాల పరిధిలో మంచినీటి రిజర్వాయర్ ల నుంచి ఎక్కువగా కేసులు వచ్చినట్లు గుర్తించామని అయన చెప్పారు. నీటి సరఫరా చేస్తున్న రిజర్వాయర్ల నుంచి నీటి శాంపిల్స్ ను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నీటిలో ఫ్లోరిన్ బాగుందని వచ్చిన నివేదికలను బట్టి తెలుస్తోందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయన అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో డి యమ ఈ డాక్టర్ నరసింహం, సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సర్జన్ ఆర్ ఎం ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.

LEAVE A RESPONSE