-అధికారం అండగా పవర్ ప్రాజెక్టులో అక్రమాలు
-అస్మదీయ కంపెనీ కోసం నిబంధనల ఉల్లంఘనలు
-ఒప్పందం వెనుక అంతా జగన్మోహన రహస్యమే
-పవర్ ప్రాజెక్టుల కేటాయింపులో మతలబు ఏమిటి?
-రెండు కంపెనీలను రద్దు చేసి మళ్లీ ఒక దానితో ఎలా కొనసాగించారు?
-పాత పాలసీ ఒప్పందం కొనసాగింపునకు నెడ్‌క్యాప్ లేఖపై అనుమానం
-జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
-ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్
అధికారం అండగా అస్మదీయ కంపెనీ కోసం రద్దు చేసిన ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించి పవర్ ప్రాజెక్టులను తన అస్మదీయ కంపెనీకి కట్టబెట్టడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీని వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిరచారు. ఈ వ్యవహారంలో తనకున్న అనుమానాలను వ్యక్తం చేస్తూ దీనిపై సమాధానం చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పవర్ ప్రాజెక్టుల ఒప్పందాన్ని రద్దు చేసి తిరిగి అందులో ఒక కంపెనీతో ఒప్పందం కొనసాగించడంలో మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో సహజ వనరులు, ప్రజా వనరుల విషయంలో ప్రభుత్వాల బాధ్యతలు ఎలా ఉండాలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015, ఏప్రిల్ 29న సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా కలిసి 3000 మెగావాట్ల విండ్ (పవన) విద్యుశ్చక్తి, 1,000 మెగావాట్ల విండ్, సోలార్ విద్యుశ్చక్తి హైబ్రిడ్ పద్ధతిలో దశల వారీగా 2016 నుంచి 2021 మధ్య ఉత్పత్తి చేసి పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ (పీఐఏ)లో నిర్ధేశించబడిరది. కానీ, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు ముందుకు జరగ లేదు.
`ఈ ప్రాజెక్టులో భాగంగా నెల్లూరు, అనంతపురం, గుర్తించిన వివిధ జిల్లాలో ఈ రెండు కంపెనీలు కలిసి బ్లేడ్, టవర్, జనరేటర్ వంటి సదుపాయాలు ప్రాజెక్టు లొకేషన్ వద్ద ఏర్పాటు చేస్తామని అగ్రి మెంట్‌లో చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే ఎక్కడా లేదు. వాస్తవానికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వ ర్యంలో అనంతపురంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి ఆపేశారని తెలిసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎనర్జీ యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ చైర్ ఏర్పాటు చేస్తామన్నారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీ ఏమైందో అందులో ఏర్పాటు చేస్తామన్న స్కిల్ డెవలప్‌మెంట్ చైర్ ఏమైందో ఆ దేవుడికే ఎరుక.
ఇదిలా ఉంటే అగ్రిమెంట్ గడువు 2021కి పూర్తి అయిన సందర్భంగా ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ (పీఐఏ), ప్రాజెక్టు అమలు కోసమం స్కీం ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ (ఎస్‌ఐఏ) గడువు సమయాన్ని పెంచుకోవడానికి నెడ్‌క్యాప్‌ను కోరాయి. 2022 సెప్టెంబర్ 19న నెడ్‌క్యాప్ తదను గుణంగా ఉత్తర్వుల కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉంది.
వాస్తవానికి 2019లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేసిన విషయం విదితమే. కానీ సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ – యాక్సిస్ ఎనర్జీ వెంచ ర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లపై ఏ ప్రేమ ఉందో, ఏ లాలూచీ వ్యవహారం నడిచిందో తెలియదు కానీ, ఏపీ విండ్ అండ్ సోలార్ పవర్ పాలసీ 2015, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2015-20 ప్రకారం హామీ ఇచ్చిన ప్రోత్సాహకాలు కొనసాగించాలని, ఈ కంపెనీల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా కొనాలని నెడ్‌క్యాప్ లేఖ రాయడం వెనుక ఏఏ లావాదేవీలు నడిచాయన్న ప్రశ్న ఉదయిస్తుంది. మిగతా కంపెనీల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి పాత పాలసీలనే ఈ కంపెనీలకు ఎందుకు వర్తింపచేశారో సమాధానం చెప్పగలరా?
సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ – యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కలిసి జాయింట్ వెంచర్ సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నెడ్‌క్యాప్, ఏపీ ట్రాన్స్‌కోతో ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ 4000 మెగా వాట్ల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టు బ్యాంకు గ్యారంటీ కింద రూ.40 కోట్లు నెడ్‌క్యాప్‌కు, రూ.200 కోట్లు ఏపీ ట్రాన్స్‌కోకు చెల్లించారు. ఏపీ ట్రాన్స్‌కో రూ.200 కోట్ల ఆమోదాన్ని రద్దు చేస్తూ కంపెనీలకు వెనక్కి ఇచ్చింది. ఈ రద్దయిన ప్రాజెక్టులకు సంబంధించి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ వెళ్లిపోయినా యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే 2022లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని వెనుక మతలబు ఏమిటి? ఒత్తిడి ఎవరిది?
రద్దయిన ప్రాజెక్టులను మరలా ఏమీ ఎరగనట్టు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరున అగ్రిమెంట్‌పై ఎలా సంతకాలు చేయిస్తారు? 2015-19 మధ్య అగ్రిమెంట్‌లో ఉన్న అంశాలను తొక్కిపెట్టి ఎలా రద్దయిన ప్రాజెక్టులను యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎలా కొనసాగిస్తారు? ఇది అక్రమం కాదా?
1672.80 మెగావాట్ల ప్రాజెక్టుల రద్దు అనంతరం 200 కోట్ల బ్యాంకు గ్యారంటీని ఏపీ ట్రాన్స్‌కో నుంచి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్-యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెనుకకు తీసుకున్నాయా, లేదా?
ఏపీ డిస్కమ్ 774.90 మెగావాట్ల పీపీఏని రద్దు చేసిన తరువాత నెర్డ్‌క్యాప్ టారిఫ్ నిర్ణయం, అనుమతి పెండిరగ్‌లో ఉందని ఎలా చెప్పింది?
2015న సుజలాన్, యాక్సిస్ రెండు కంపెనీలతో ప్రారంభమైన అగ్రిమెంట్ 2022 నాటికి కేవలం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మాత్రమే ప్రాజెక్టు అమలును ఎలా చేస్తున్నారు?
సహజవనరులపై వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు
ప్రభుత్వం అన్ని సహజ వనరులను ప్రజల విశ్వాసంతో కాపాడాలి. ప్రజా ప్రయోజనాల కోసం వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉంది. (ఎంసీ మెహతా వర్సెస్ కమలనాథ్, (1997) 1 ఎస్‌సీసీ 388)
` సహజ వనరులకు సంబంధించి సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలి, తద్వారా దీర్ఘకాలికంగా స్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చు. (టి.ఎన్.గోదావర్మన్ తిరుముల్పాడ్, రే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2022) 10 ఎస్‌సీసీ 544)
` సహజ వనరులను ప్రైవేట్ లాభాల కోసం దాతృత్వంగా పంపిణీ చేయడం సాధ్యం కాదు. ఇది వారి విలువ కంటే తక్కువ ధరకు ఇవ్వబడదు. ఇది దేశ పౌరులకు నష్టం చేస్తూ కొంతమంది లాభాలను పొందే ఆస్కారం ఇచ్చే విధంగా ఉండరాదు.(సహజ వనరుల కేటాయింపు కేసు, (2012) 10 ఎస్‌సీపీ(1)
ప్రభుత్వం, దాని ఏజెన్సీలు/సంస్థల ద్వారా భూమి కేటాయింపు, లైసెన్సుల మంజూరు, అనుమతులు వంటి అంశాలు ఎల్లప్పుడూ న్యాయమైనవిగా సమానమైన పద్ధతిలో జరగాలి. పక్షపాతం లేదా బంధుప్రీతి అంశం విచక్షణను ప్రభావితం చేయకూడదు. ఏదైనా ఇటువంటి అంశాలు ప్రభావి తం జరిగితే ప్రభుత్వం యొక్క నిర్దిష్ట నిర్ణయ అధికారికి ఆపాదించబడుతుంది. (2జీ స్కామ్ కేసు, (2012) 3 ఎస్‌సీసీ 1)
రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం రాష్ట్రంలోని రాజకీయ సంస్థలు/అధికారుల అభిరుచుల ప్రకారం ఏ వ్యక్తికి లేదా సంస్థకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు ఉండకూడదు. ప్రభుత్వం దాని ఏజెన్సీలు /సంస్థల యొక్క ప్రతి చర్య/ నిర్ణయం తప్పనిసరిగా లోపభూయిష్టంగా ఉండరాదు. పారదర్శక విధా నంతో స్పష్టమైన బాగా నిర్వచించబడిన విధానాలు అవలంభించి ప్రభుత్వ నిర్ణయాలను అధికారిక గెజిట్‌లో ప్రచురించి ప్రజలకు తెలియజేయాలి. అలాగే గుర్తింపు పొందిన ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. అటువంటి విధానాన్ని పాలసీ ద్వారా ప్రయోజనం పొందడానికి ప్రతిపాదిం చిన వ్యక్తుల తరగతి లేదా వర్గంతో సంబంధం లేకుండా వివక్షత లేని, అందరికీ సమానంగా ఉండే విధంగా ఏకపక్ష పద్ధతిని అనుసరించి ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంది.
దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు సహజ వనరుల కేటాయింపు ఏ విధంగా జరగాలో వివిధ తీర్పులలో తెలిపిన విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో నేటి రాష్ట్ర ప్రభుత్వం అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టే విధంగా విధానాల రూపకల్పన జరుగుతుందని లంకా దినకర్ ఆరోపించారు. పై ఒప్పందానికి సంబంధించిన అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్దాన పరిధిలో అభిశంసనకు గురికాక తప్పదని హెచ్చరించారు.