Suryaa.co.in

Andhra Pradesh

రేపు నామినేషన్‌ వేయనున్న లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం నామినేషన్‌ దాఖలు చేయను న్నారు. నరసరావుపేట లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్‌ సమర్పిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని కాకతీయ నగర్‌ (హీరో హోండా షోరూమ్‌) దగ్గర నుంచి ర్యాలీగా ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీ, పల్నాడు బస్టాండ్‌, గడియార స్థంభం, శివుని బొమ్మ సెంటర్‌ మీదుగా మల్లమ్మ సెంటర్‌కు చేరుకుంటారు. ర్యాలీ అనంతరం మల్లమ్మ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తారు. కూటమి నాయ కులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

LEAVE A RESPONSE