Suryaa.co.in

Andhra Pradesh

ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

రాష్ట్రంలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి. శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE