– సాధుసంతుల పిలుపు
-ధర్మ విరోధులను ఓటుతోనే సమాధి చేయాకంటే ధర్మరక్షకులకే ఓటేయాలి
– విశ్వహిందూ పరిషత్ పిలుపు
ప్రస్తుతం జరుగుతున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికలలో హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ఓటు వేయాలనీ సాధుసంతులు అన్నారు. సనాతన హైందవ ధర్మ సంరక్షకులు, సాధుసంతులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు అండదండగా నిలబడే వారిని ఎన్నికలలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సాధుసంతులు మాట్లాడారు. హిందువులంతా సమైక్యంగా ధర్మపరీక్షకులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను సమష్టిగా తిప్పి కొట్టాలంటే.. ధర్మానికి అండగా నిలబడే సమర్థవంతమైన నాయకులనే ఆదరించాలనీ హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మతమార్పిడిని ప్రోత్సహిస్తూ.. లవ్ జిహాద్ ను ఎంకరేజ్ చేస్తూ… హిందూ ధర్మాన్ని అవహేళన చేసే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. దేవాలయాల భూములు కబ్జాలు చేస్తూ… దేవుడి సొమ్మును మింగుతున్న నేతలు నేడు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారని, వారిని ఓటుతోనే సమాధి చేయాలన్నారు.
దేశం కోసం.. ధర్మం కోసం.. హైందవ సమాజం కోసం పరితపిస్తున్న నేతలను ఆదరిస్తేనే హిందువుల మనుగడ అని.. లేదంటే హిందువులు కనుమరుగవడం ఖాయమని స్వామీజీలు పేర్కొన్నారు. నేడు దేశంలో బలమైన సుస్థిరమైన నాయకులు ఉన్నారని, వారిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నేడు హిందూ సమాజంపై దాడి చేసేందుకు విధర్మీయులంతా ఐక్యమత్యంగా ముందుకు వస్తున్నారని.. వారంతా ఓటుతోనే మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ఎలక్షన్ రోజు అంటే హాలిడే కాదని.. (పోలింగ్ తేదీ సెలవు దినం కాదని) ప్రతి ఒక్కరూ శ్రమకోర్చి క్యూలో నిలబడి హిందూ ధర్మ పరిరక్షకులకు ఓటు వేయాలనీ వారు సూచించారు.
ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు నమోదు వివరాలను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింల ఓటింగ్ శాతం దాదాపు 11 శాతం పెరిగిందని.. అదే సందర్భంలో హిందువుల ఓటు ఆరు శాతం తగ్గిందనే వివరాలు మన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇది భయంకరమైన పెను ప్రమాదానికి సవాలు లాంటిదని చెప్పారు. ఇప్పటికే హిందువుల జనాభా తగ్గు ముఖం పట్టిందని, పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలను మతం మార్చి లవ్ జిహాద్ పేరా ఎరవేసుకుపోవడం.. దానికి తోడు సామాజిక అసమానతలు.. ఆర్థిక అసమాన తల కారణంగా రకరకాల ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడి చేయడం వంటి అనేక సమస్యలతో హిందుత్వం సతమతమవుతుందన్నారు.
మన అనైక్యత వల్లనే 15 నిమిషాలలో హిందువులను అంతం చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నా.. ఏ రాజకీయ నాయకుడు కూడా వారిని తప్పు పట్టడం లేదన్నారు. అంటే ఓటు ఎంత ప్రాధాన్యం సంతరించుకుందో మనం గమనించాలన్నారు. అయోధ్య శ్రీరాముడి అక్షంతలపై అనేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నామన్నారు. హిందువులంతా సంఘటితమై హిందూ ధర్మ పరి రక్షిణకు కట్టుబడి ఉండే నాయకులను ఎన్నుకోవాలన్నారు.
విలేకరుల సమావేశంలో సుదర్శన స్వామీజీ, (దండి ఆశ్రమం, కామారెడ్డి) బెనారస్ గురూజీ (శ్రీ జగదాంబ శక్తి పీఠం, బాచుపల్లి) మాత పద్మజానంద (పరాశక్తి పీఠం, ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి) విజయ ప్రతాప్ మహారాజ్ (యోగా గురుజి) గురూజీ జగన్నాథశాస్త్రి (శ్రీ పీఠం ,అల్వాల్) వెంకటేశ్వర ఆచార్య (ధర్మసంవర్ధన పీఠం, ఉప్పల్) కాంతేంద్ర స్వామీజీ (దత్తపీఠం అబ్దుల్లాపూర్ మెట్) విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భోజనపల్లి నరసింహమూర్తి, శాలివాహన పండరినాథ్ , రామరాజు, పగుడాకుల బాలస్వామి, జగదీశ్వర్, సుభాష్ చందర్, శివ రాములు, పుప్పాల వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, రమేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు