-చంద్రబాబు హామీ.. మచిలీపట్నంలో తొలి పెన్షన్ -అందుకోనున్న పర్వీన్
మచిలీపట్నం: ఫత్తుల్లాబాద్ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది. 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల పెన్షన్ ను మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.