రాష్ట్రంలో మాఫియా నడుపుతున్నారా?
విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర
ఎక్కడైనా రైతుల దగ్గర స్మార్ట్ మీటర్లు ఉన్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలి
రేవంత్ రెడ్డి అబద్ధానికి పర్యాయ పదం
మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు
విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు కంపెనీలకు
మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు,అబద్దాలతో అధికారంలోకి వచ్చింది.ఇపుడు అదే అబద్దాలతో పాలన సాగిస్తోంది. రేవంత్ రెడ్డి అనే పేరు అబద్దానికి పర్యాయ పదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టమన్నా కేసీఆర్ ఒప్పుకోలేదు. 2017 లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పు దోవ పట్టించారు.
రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధం. రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ పధకానికి చెందినది. ఉదయ్ కు సంబంధించిన పేపర్లోని వాక్యాన్ని కొంత మింగి కొంతే చెప్పారు. మీడియా లో తప్పుడు వార్తలు రాసేలా పతాక శీర్షికల్లో వచ్చేలా సీఎం రెవంత్ కుట్ర పన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు
కేంద్రం మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు.
రాష్ట్రంలో మాఫియా నడుపుతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల రాతలు రాయిస్తున్నారు. త్వరలోనే విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. విద్యుత్ సంస్థలను ప్రయివేటు వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల దగ్గర స్మార్ట్ మీటర్లు ఉన్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారు.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తప్పించుకుని పారిపోయారు. ఉదయ్ అనే పధకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకువచ్చింది. ఉదయ్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరింది.
హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లులు కట్టడం లేదని పేపర్లలో తప్పుడు రాతలు రాయించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి మీటర్లు పెట్టాము. విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోందా ,దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకుంటున్నట్టు ఉంది. విద్యుత్ వినియోగదారులను కసాయిలకు అప్పగించే కుట్ర జరుగుతోంది.
ఈ స్మార్ట్ మీటర్ల ప్రస్తావన ఇపుడు తీసుకురావడం లో దుర్మార్గం ఉంది. కేసీఆర్ పదేళ్లు తెలంగాణ ప్రజలను కడుపు లో పెట్టుకుని చూసుకున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నీచమైన సీఎం దేశం లో మరెవ్వరూ లేరు. అసెంబ్లీ లో మందబలం తో ఏమార్చగలడేమో రేవంత్ ప్రజల నుంచి తప్పించుకోలేవు. కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరూ దాచిపెట్టలేరు.
అసెంబ్లీ లో తప్పించుకున్నావ్ ..వస్తావా రేవంత్ బహిరంగ చర్చకు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తెలంగాణ లో మీటర్లు పెట్టనందునే అప్పులకు వెసలు బాటు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఉదయ్ స్కీం లో 27 రాష్ట్రాలు చేరాయి. అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉదయ్ వల్ల వినియోగదారులకు నష్టం లేదు.
ఏదో కొలంబస్ లాగా వాస్కోడిగామా లా ఏదో కనిపెట్టినట్టు రేవంత్ ఆ పేపర్ తీసుకొచ్చాడు. మీడియా లో రేవంత్ రోత రాతలు రాయించాడు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు రాసిన పత్రికలు తమ వైఖరి మార్చుకోవాలి.
స్మార్ట్ మీటర్ల పేరిట రైతులకు ఉరి వేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడు. తనకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను కట్టబెట్టేందుకు రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నాడు. తెలంగాణ ప్రజలు రేవంత్ కుట్రలను గమనించాలి. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.