- ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉండాలి
- గత ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారులు కూడా పక్క రాష్ట్రాలకెళ్లారు
- పెండింగ్ లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి
- చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తాం…ఈనెల 7న చీరాలలో చేనేత దినోత్సవం నిర్వహణ
- కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం చంద్రబాబు
అమరావతి : పెండింగులో ఉన్న రైల్వే క్రాసింగ్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. 2014-19 మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి యేడాది తప్ప మిగతా 4 ఏళ్లు మొదటి స్థానంలో ఉన్నాం. రోడ్ల నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ నుండి ఎక్కువగా కాలయాపన జరుగుతోంది. అడవులు తవ్వుకుపోయినప్పుడు స్తబ్దుగా ఉన్నారు…రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు.
పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములను ప్రచారం కోసం ఇళ్ల స్థలాల కేటాయించారు.ఏపీఐఐసీలోనూ అక్రమాలు జరిగాయి. పోర్టుల నిర్మాణంలో టీడీపీ హయాంలో పీపీపీ తీసుకొస్తే గత ప్రభుత్వం ఈపీపీ విధానం తీసుకొచ్చింది. పోర్టులు త్వరితగతిన పూర్తవ్వాలి. 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి. 4 కొత్త పోర్టులు వస్తున్నాయి. మరో 3 విమానాశ్రయాలు వస్తాయి…మొత్తం 10 ఎయిర్ పోర్టుల నిర్మాణం పూర్తవ్వాలి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉండాలి. గత ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో రాష్ట్రానికి చెందిన వారు కూడా పెట్టుబడులు పెట్టకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఏ ప్రాజెక్టైనా ఆసల్యం అయితే ఖర్చు అదనం అవుతుంది.
గతంలో పీపీఏలు రద్దు చేశారు. పీపీఏ లు రద్దు చేసినందుకు ఆయా సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకూడదు. విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే. కొరత విద్యుత్ ను అధికమించి మిగులు విద్యుత్ సాధించాం. కానీ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో మళ్లీ కోతలు వచ్చాయి.
విద్యుత్ ఆదాకు కూడా ప్రాధాన్యం ఉండాలి. పవర్ కొరత ఉన్న చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేయాలి. పగటి పూటే రైతులకు విద్యుత్ అందించాలి. విద్యుత్ వాహనాలు వినియోగం పెరగాలి.
గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు ఖర్చు చేయలేదు. రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వలేదు.రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా నాకు రాకూడదు.
హ్యాండ్లూమ్స్ ను ప్రమోట్ చేయాలి. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తాం. టాటా సంస్థతో మంగళగిరి చేనేతలు ఒప్పందం కుదుర్చుకుని విక్రయాలు చేస్తున్నారు..అలాంటి మోడల్ రావాలి.