Suryaa.co.in

Andhra Pradesh

‘గురుకుల’ ఘటనపై మంత్రి డోలా ఆరా!

  • ఘటనపై జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
  • విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

విజయవాడ: కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థుల అస్వస్థత ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కాకినాడ కలెక్టర్, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

LEAVE A RESPONSE